News July 7, 2025

సిరిసిల్ల: మహిళలు వేధింపులకు గురవుతున్నారా..?

image

వేధింపులు ఎదురైతే ఏం చేయాలి? ఎవరి సహాయం కోరాలి? ఇలా అయోమయంలో పడే మహిళలకు భరోసాగా మారుతోంది రాజన్నసిరిసిల్ల జిల్లాలోని షీ టీం. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈ బృందం నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళా చట్టాలు, రక్షణకోసం తీసుకుంటున్న చర్యలపై తెలియజేస్తోంది. వేధింపులు ఎదురైతే 8712656425కు ఫోన్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Similar News

News July 7, 2025

బల్దియా కౌన్సిల్ సమావేశానికి మంత్రి సురేఖ గైర్హాజరు

image

వరంగల్ మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా మంత్రి కౌన్సిల్ సమావేశానికి రాలేకపోయారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా కౌన్సిల్ సమావేశంలో మేయర్ సుధారాణి అధికారికంగా బల్దియా బడ్జెట్‌ను ప్రకటించారు.

News July 7, 2025

HYD: హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే: కమిషనర్

image

హైడ్రా విజన్ అండ్ ఎజెండా అంశంపై ‘ప్రశ్నలు–జవాబులు’ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటుందన్నారు. దేశ- విదేశాల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, హైడ్రాకు 169 పోస్టులు శాంక్షన్ కాగా, ప్రస్తుతం కేవలం 45 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇంకా రెండు వేల మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ద్వారా సేవలందిస్తున్నామన్నారు.