News July 7, 2025

విశాఖలో పేకాట స్థావరాలపై దాడులు

image

మధురవాడ పరిధి కొమ్మాది శివార్లలో పేకాట ఆడుతున్న ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుండి రూ.43 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని పీఎంపాలెం పోలీసులకు అప్పగించారు. అలాగే భీమిలి సమీపంలో ఓ రిసార్ట్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి రూ.2.51వేలు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News July 7, 2025

విశాఖ: పోలీస్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందజేత

image

ఆర్కే బీచ్ వద్ద పోలీస్ విభాగానికి వివిధ సంస్థలు, ప్రభుత్వం సమకూర్చిన ఏసీ హెల్మెట్లు, టూవీలర్స్, ఇతర సామగ్రిని హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం అందజేశారు. పోలీస్ సిబ్బందికి మౌలిక వసతులు అందిస్తే మరింత సమర్థవంతంగా పనిచేస్తారని ఆమె అన్నారు. దాదాపు రూ.70 లక్షలతో 20 హెల్మెట్లు, 64 ద్విచక్ర వాహనాలు, రెండు కెమెరాలు అందజేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

News July 7, 2025

ఆనందపురం: లారీని ఢీకొన్న కారు.. తండ్రి మృతి, కుమారుడికి గాయాలు

image

ఆనందపురం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పార్వతీపురం జియమ్మవలసకు చెందిన కరకవలస రమణమూర్తి తన కుమారుడితో కలిసి కారులో మద్దిలపాలెంలోని అల్లుడు ఇంటికి వస్తున్నారు. ఆనందపురం హైవే బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొంది. రమణమూర్తి అక్కడికక్కడే చనిపోగా తీవ్ర గాయాలపాలైన సంతోష్‌ను ఆసుపత్రికి తరలించినట్లు ఆనందపురం సీఐ తెలిపారు.

News July 7, 2025

విశాఖ: ’10 వేల మంది మార్గ‌ద‌ర్శుల‌ను గుర్తించాలి’

image

పీ-4 విధానానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చి ప‌ని చేయాల‌ని, జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాల అవ‌స‌రాల‌ను తెలుసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్షరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. బంగారు కుటుంబాలను ద‌త్త‌త తీసుకునేందుకు ముందుకు వ‌చ్చే మార్గ‌ద‌ర్శుల‌ను వారం రోజుల్లో గుర్తించాల‌ని ఆదేశించారు. స‌చివాల‌యం ప‌రిధిలో 50 బంగారు కుటుంబాల అవస‌రాల‌ను గుర్తించాలన్నారు.