News July 7, 2025

వరంగల్: నేడు బల్దియా సమావేశం

image

గ్రేటర్ వరంగల్ నగర పాలకవర్గం సమావేశం సోమవారం ఉదయం 11.30 గంటలకు జరగనుంది. ఈ మేరకు నగరంలో 66 డివిజన్లలో పెండింగ్‌లో ఉన్న పనులకు సంబంధించి నిధులు విడుదల చేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. పాలకవర్గం కాల పరిమితి మరో 10 నెలలు ఉండటంతో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో 23 అంశాలను కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టనున్నారు.

Similar News

News July 7, 2025

HYD: హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే: కమిషనర్

image

హైడ్రా విజన్ అండ్ ఎజెండా అంశంపై ‘ప్రశ్నలు–జవాబులు’ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటుందన్నారు. దేశ- విదేశాల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, హైడ్రాకు 169 పోస్టులు శాంక్షన్ కాగా, ప్రస్తుతం కేవలం 45 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇంకా రెండు వేల మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ద్వారా సేవలందిస్తున్నామన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతూ లోకేశ్ ఎమోషనల్

image

AP: మంత్రి నారా లోకేశ్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇద్దరు భిక్షాటన చేసే చిన్నారులు అధికారుల చొరవతో తాజాగా స్కూళ్లో చేరగా వారికి భవిష్యత్తులో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ.. పేదరికం నుంచి బయటపడేలా చేసే శక్తిమంతమైన సాధనం విద్య అని లోకేశ్ చెప్పారు. తాను ఈ స్థాయికి ఎదిగేందుకు తన తల్లే కారణమని, ఆమె వల్లే క్రమశిక్షణ అలవడిందని మంత్రి ఎమోషనల్ అయ్యారు.