News March 30, 2024

మడకశిర: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

మడకశిర పట్టణం ఎగువ అచ్చంపల్లి గ్రామ సమీపంలో సోమశేఖర్‌(45) అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్‌ఐ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన సోమశేఖర్‌ తాగుడుకు బానిసై, కుటుంబ పోషణ భారమై, జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య సుబ్బలక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Similar News

News March 19, 2026

అనంత: రూ.1.30 కోట్లకు పైగా పంట నష్టం

image

అనంతపురం జిల్లాలో ఈదురుగాలుల తాకిడికి ఉద్యాన, వ్యవసాయ పంటలు చెల్లాచెదురైన పరిస్థితి నెలకొంది. కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు, ఆత్మకూరు, గార్లదిన్నె, శింగనమల తదితర మండలాలలో 65 ఎకరాలలో అరటి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. రూ.1.30 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. వరి, మొక్కజొన్నతో పాటు ఇతర ఉద్యాన పంటల నష్టం వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

News March 19, 2026

ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం: కలెక్టర్

image

నూతన సంవత్సరాది ఉగాది పండుగను తెలుగు సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అనంతపురం కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ గురువారం ఉగాది పండుగను జిల్లా సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు పరాభవ నామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

News March 19, 2026

ఉగాదిని సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

జిల్లా ఎస్పీ జగదీశ్ ప్రజలకు ఉగాది రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన తెలుగు సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎస్పీ ఆకాంక్షించారు. జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ఉగాదిని సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. సేవా దృక్పథంతో, ఆధ్యాత్మిక చింతనతో పండుగలను జరుపుకోవాలని సూచించారు.