News July 7, 2025

ఇవాళ, రేపు కడప జిల్లాలో జగన్ పర్యటన

image

AP: వైసీపీ అధినేత జగన్ ఇవాళ, రేపు YSR కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న ఆయన రాత్రికి అక్కడ బస చేస్తారు. రేపు ఉదయం 7.30 గంటలకు పులివెందుల నుంచి బయల్దేరి ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత YSR జయంతి సందర్భంగా ఘాట్‌లో ఆయనకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలుస్తారు.

Similar News

News July 7, 2025

స్మార్ట్ కార్డులుంటేనే సచివాలయంలోకి ఎంట్రీ!

image

AP: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఎంట్రీకి స్మార్ట్ కార్డు సిస్టమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వచ్చే వారం నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రతి ఉద్యోగికి క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డు అందజేస్తారు. మెయిన్ గేట్ వద్ద వాహనాల నంబర్‌ను స్కాన్ చేసి అనుమతించనున్నారు. ఇందుకోసం టోల్గేట్ తరహా టెక్నాలజీ ఉపయోగించనున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వివరాలు, వాహనాల నంబర్ల సేకరణ ప్రారంభమైంది.

News July 7, 2025

వచ్చే ఏడాది ‘పంచాయత్’ ఐదో సీజన్

image

కామెడీ డ్రామా సిరీస్ ‘పంచాయత్’ ఐదో సీజన్‌ను అనౌన్స్ చేసింది. ఈ సీజన్ వచ్చే ఏడాది స్ట్రీమింగ్‌ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో పోస్టర్‌ను రిలీజ్ చేసింది. హిందీ భాషలో రూపొందిన ఈ సిరీస్ నాలుగు పార్టులు ఇతర భాషల ప్రేక్షకులనూ మెప్పించాయి. జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్‌ను తెలుగులో ‘సివరపల్లి’ పేరిట రీమేక్ చేసి ఈ ఏడాది జనవరిలో తొలి సీజన్‌ను రిలీజ్ చేశారు.

News July 7, 2025

రేపు పలు జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. గుంటూరు, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో చిన్నపాటి జల్లులు పడేందుకు ఛాన్స్ ఉందని వివరించింది. ఇవాళ పలు జిల్లాల్లో వర్షం కురిసింది. మీ ప్రాంతంలో వాన పడిందా? కామెంట్ చేయండి.