News July 7, 2025
నూజివీడు IIITలో 141 సీట్లు ఖాళీ

నూజివీడు IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల భర్తీ పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 869 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 141 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11, 12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.
Similar News
News July 7, 2025
HYD: హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే: కమిషనర్

హైడ్రా విజన్ అండ్ ఎజెండా అంశంపై ‘ప్రశ్నలు–జవాబులు’ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటుందన్నారు. దేశ- విదేశాల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, హైడ్రాకు 169 పోస్టులు శాంక్షన్ కాగా, ప్రస్తుతం కేవలం 45 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇంకా రెండు వేల మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ద్వారా సేవలందిస్తున్నామన్నారు.
News July 7, 2025
విద్యార్థులతో మాట్లాడుతూ లోకేశ్ ఎమోషనల్

AP: మంత్రి నారా లోకేశ్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇద్దరు భిక్షాటన చేసే చిన్నారులు అధికారుల చొరవతో తాజాగా స్కూళ్లో చేరగా వారికి భవిష్యత్తులో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ.. పేదరికం నుంచి బయటపడేలా చేసే శక్తిమంతమైన సాధనం విద్య అని లోకేశ్ చెప్పారు. తాను ఈ స్థాయికి ఎదిగేందుకు తన తల్లే కారణమని, ఆమె వల్లే క్రమశిక్షణ అలవడిందని మంత్రి ఎమోషనల్ అయ్యారు.
News July 7, 2025
యాక్టర్ల ఫోన్ ట్యాపింగ్‌కు ఆధారాల్లేవని పోలీసులు చెప్పారు: BRS

TG: ఫోన్ ట్యాపింగ్ పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర బయటపడిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ‘సినీ నటుల ఫోన్ ట్యాపింగ్‌కు ఎలాంటి ఆధారాలు లేవని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. పచ్చ మీడియాతో కుమ్మక్కై ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడిన రేవంత్ సర్కార్ కుట్ర ఇది అని తేటతెల్లమైంది’ అంటూ ఓ న్యూస్ క్లిప్పింగ్‌ను షేర్ చేసింది.