News July 7, 2025
వై.రామవరం: ప్రభుత్వం ఆదుకోవాలి

కడుపులోని పెరుగుతున్న పెద్దకాయతో బాధపడుతూ ఓ వ్యక్తి మంచానికే పరిమితమయ్యాడు. వై.రామవరం (M) కే.ఎర్రగొండకు వెంకటేశ్ దీర్ఘకాలంగా ఈ వ్యాధితో బాధ పడుతున్నాడు. తల్లిదండ్రులు, తోడపుట్టిన వాళ్లు ఇటీవల మరణించారని, ఒంటరిగా ఉన్న తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.
Similar News
News July 7, 2025
నేటి ప్రజావాణికి 95దరఖాస్తులు: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ప్రజావాణికి వచ్చినా దరఖాస్తుల వివరాలు వెల్లడించారు. భూ సమస్యలు 47, ఎంపీడీఓకి 13, డీపీఓ 10, శాఖలకు సంబంధించి 25 మొత్తం 95 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకి పంపుతామన్నారు.
News July 7, 2025
రాజమండ్రి: పీజీఆర్ఎస్‌కు 216 అర్జీలు

తూ.గో జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో మొత్తం 216 అర్జీలు అందినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అర్జీదారుల సమస్యల పరిష్కారం, వారి సంతృప్తి స్థాయిని తెలుసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
News July 7, 2025
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: సిద్దిపేట కలెక్టర్

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఐడీఓసీలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగర్‌వాల్, అబ్దుల్ హమీద్‌తో కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి 152 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు.