News July 7, 2025

వికారాబాద్‌కు 10,657 రేషన్ కార్డులు మంజూరు

image

ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజల కష్టాలు దూరం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10,657 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఆయా రేషన్ కార్డుల్లో మొత్తం 88,374 మంది కుటుంబీకులు ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు రావడంతో జిల్లాలో 506 మెట్రిక్ టన్నుల బియ్యం కోట పెరిగింది. ఈనెల 14న CM రేవంత్ రెడ్డి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన తర్వాత జిల్లాలో ప్రజాప్రతినిధులు రేషన్ కార్డులు అందజేయనున్నారు.

Similar News

News July 7, 2025

BHPL: ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: ఎస్పీ

image

ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పోలీసు అధికారులు కృషి చేయాలని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ వివిధ రకాల సమస్యలతో వచ్చిన 18 మంది బాధితుల సమస్యలను సోమవారం అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

News July 7, 2025

కొత్తగూడెం: ‘మీకు దండం పెడతాం.. మాకు స్కూల్ కావాలి’

image

బూర్గంపహాడ్ మండలం శ్రీరాంపురం విద్యార్థులు తమ గ్రామంలో పాఠశాల లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. 15 మందికి పైగా విద్యార్థులు చదువుకునేందుకు సూదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదని, చదువుకునేందుకు స్కూల్‌కి వెళ్లడానికి నరకయాతన పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

News July 7, 2025

రాష్ట్రంలో క్రీడా పోటీలు నిర్వహించండి: CM రేవంత్

image

ఢిల్లీ పర్యటనలో ఉన్న TG CM రేవంత్ కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఖేలో ఇండియా, జాతీయ, అంతర్జాతీయ తదితర ఈవెంట్లు నిర్వహించాలని కోరారు. ఖేలో ఇండియా స్కీమ్ కింద అథ్లెట్లకు ట్రైనింగ్, మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లకు రైల్వే టికెట్లలో రాయితీని పునరుద్ధరించాలని సీఎం ఆయన దృష్టికి తీసుకెళ్లారు.