News July 7, 2025

కరీంనగర్ జిల్లాలో ఉన్నత స్థానాల్లో మల్యాల వాసులు

image

మల్యాలకు చెందిన ఇరువురు వ్యక్తులు ఉన్నత స్థాయి ఉద్యోగాలతో కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. మల్యాలకు చెందిన వాసాల సతీష్ కుమార్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో అసిస్టెంట్ కమిషనర్‌గా, అలాగే సీనియర్ న్యాయవాది మల్యాల ప్రతాప్ కరీంనగర్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన వీరిరువురు ఉన్నత స్థానాల్లో ఉండడం పట్ల మల్యాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News July 7, 2025

రాజమండ్రి: పీజీఆర్ఎస్‌కు 216 అర్జీలు

image

తూ.గో జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో మొత్తం 216 అర్జీలు అందినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అర్జీదారుల సమస్యల పరిష్కారం, వారి సంతృప్తి స్థాయిని తెలుసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

News July 7, 2025

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: సిద్దిపేట కలెక్టర్

image

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఐడీఓసీలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగర్‌వాల్, అబ్దుల్ హమీద్‌తో కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి 152 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు.

News July 7, 2025

MBNR: HCA 2డే లీగ్.. మొదటి రోజు మనదే

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి B- డివిజన్ 2డే లీగ్ టోర్నీలో ఉమ్మడి పాలమూరు జిల్లా జట్టు మొదటి రోజు సత్తాచాటింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 68.1 ఓవర్లలో 243/10 పరుగులు చేసింది. అనంతరం రాకేష్-XI జట్టు 19.1 ఓవర్లలో 55/6 పరుగులు చేసింది. మహబూబ్ నగర్ జట్టులో శ్రీకాంత్-71, సంజయ్-69 పరుగులు చేయగా.. గగన్ 4 వికెట్లు తీశారు. మహబూబ్ నగర్ 188 పరుగుల లీడ్‌లో ఉంది.