News July 7, 2025
అన్నమయ్య: భార్య కాపురానికి రాలేదని సూసైడ్

అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గాలివీడు(M) మల్లసానివాళ్లపల్లెకు చెందిన తుపాకుల గోపాల్(37)కు పెద్దమండ్యానికి చెందిన రమణమ్మతో పదేళ్ల కిందట పెళ్లి జరగ్గా నలుగురు పిల్లలు ఉన్నారు. గోపాల్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో రమణమ్మ పుట్టింటికి వెళ్లింది. ఆమె కాపురానికి రావడం లేదని, తాను చనిపోతానని తల్లిదండ్రులకు గోపాల్ చెప్పాడు. తన ఇంట్లోనే ఉరేసుకున్నాడు.
Similar News
News July 7, 2025
రాజమండ్రి: నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిర్మానుష్య ప్రాంతాల్లో సోమవారం డ్రోన్‌తో నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి, నేరాలను కట్టడి చేయడానికి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News July 7, 2025
సిద్దిపేట: ‘మెరుగైన సేవలు అందిస్తున్నాం’

రవాణా శాఖ పరంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ రవాణా శాఖ అధికారి వెంకటరమణ అన్నారు. సోమవారం సిద్దిపేట రవాణా శాఖ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ మేరకు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా రవాణా శాఖ కార్యాలయానికి రావాలన్నారు.
News July 7, 2025
నేటి ప్రజావాణికి 95దరఖాస్తులు: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ప్రజావాణికి వచ్చినా దరఖాస్తుల వివరాలు వెల్లడించారు. భూ సమస్యలు 47, ఎంపీడీఓకి 13, డీపీఓ 10, శాఖలకు సంబంధించి 25 మొత్తం 95 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకి పంపుతామన్నారు.