News July 7, 2025
యాదాద్రి: మహిళలకు అబార్షన్.. పోలీసుల అదుపులో వైద్యుడు

భువనగిరి గాయత్రి ఆసుపత్రిలో ఇద్దరు మహిళలకు అబార్షన్ చేసిన ఓ డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు SI కుమారస్వామి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం అర్ధరాత్రి హాస్పిటల్‌కు వెళ్లి తనిఖీ చేయగా మహిళలకు అబార్షన్ చేసి అబ్జర్వేషన్‌లో ఉంచగా, డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్కానింగ్ చేసిన మరో డాక్టర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. మహిళలు ఇద్దరు యాదాద్రి జిల్లాకు చెందిన వారుగా తెలుస్తోంది.
Similar News
News July 7, 2025
GWL: SP ప్రజావాణికి 19 ఫిర్యాదులు

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 19 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. సివిల్ అంశాలకు సంబంధించిన సమస్యలను న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. కుటుంబ విభేదాలకు సంబంధించిన అంశాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు.
News July 7, 2025
VZM: కలెక్టరేట్‌కు 194 వినతులు

విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRSకు ప్రజల నుంచి 194 వినతులు అందాయి. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 97 వినతులు అందగా పంచాయతీ శాఖకు 7, పింఛన్లు మంజూరు చేయాలని, తదితర అంశాలపై డీఆర్డిఏకు 31 వినతులు వచ్చాయి. మున్సిపాలిటీకి 5 , విద్యాశాఖకు 13, మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. వినతులు పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు.
News July 7, 2025
నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి: హరీశ్ రావు

TG: రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘20 నెలలుగా రాష్ట్రంలో పాలన కుంటుపడింది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా AP నీటిని తరలించుకుపోతోంది. కానీ ఇక్కడి కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి నీటిని వాడుకోవడం రేవంత్‌కు చేతకావట్లేదు. కాంగ్రెస్ సర్కారు గురించి ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది’ అని అన్నారు.