News July 7, 2025

ఇంజినీరింగ్ సీట్ల భర్తీపై ఉమ్మడి గుంటూరులో ఆసక్తి

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్‌కు 33,063 మంది హాజరైన వారిలో 23,536 మంది అర్హత సాధించారు. జిల్లాలోని రెండు ప్రభుత్వ యూనివర్సిటీలు (ANUతోపాటు JNTU నరసరావుపేట) సహా 34 ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 32,240 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆదివారం విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, 7 నుంచి 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌లు, 22న సీట్లు కేటాయించనున్నారు. అయితే అభ్యర్థుల కంటే సీట్లు ఎక్కువగా ఉన్నాయి.

Similar News

News July 7, 2025

వారం రోజులు మహిళాశక్తి సంబరాలు: కలెక్టర్

image

మహిళల ఆర్థికాభివృద్ధి సాధనకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో నేడు ఆయన పాల్గొన్నారు. మహిళా శక్తి సంబరాలు మహిళల నైపుణ్యాలను ప్రదర్శించే అద్భుత వేదిక అని అన్నారు. మహిళా సాధికారతకు దోహదపడుతుందని తెలిపారు.

News July 7, 2025

10న తెలంగాణ క్యాబినెట్ భేటీ

image

తెలంగాణ క్యాబినెట్ ఈనెల 10న భేటీ కానుంది. రాష్ట్ర సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు, ప్రభుత్వ పథకాలపై చర్చించే అవకాశం ఉంది. అటు సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

News July 7, 2025

తిరువణ్ణామలై నుంచి విజయవాడకు స్పెషల్ ట్రైన్‌లు

image

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా అరుణాచలం (తిరువణ్ణామలై) నుంచి నరసాపురంకు స్పెషల్ రైళ్లు నడపనున్నారు. జులై 10, 17, 24, ఆగస్టు 7, 14, 21, సెప్టెంబర్ 4, 25 తేదీలలో నం.07220 తిరువణ్ణామలై-నరసాపురం రైలు నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో విజయవాడతో పాటు కైకలూరు, గుడివాడలో ఆగుతాయన్నారు. పై తేదీలలో ఉదయం 11 గంటలకు తిరువణ్ణామలైలో బయలుదేరే ఈ రైళ్లు తర్వాతి రోజు అర్ధరాత్రి 2 గంటలకు నరసాపురం చేరుకుంటాయన్నారు.