News July 7, 2025
HYD: త్వరలో POLYCET ఫేజ్-1 రిజల్ట్

POLYCET-2025 మొదటి ఫేజ్ రిజల్ట్ జులై 4వ తేదీన రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రాలేదు. దీంతో కాలేజీల ఆప్షన్స్ ఎంచుకున్న అభ్యర్థులు కంగారు పడుతున్నారు. దీనిపై HYD ఈస్ట్ మారేడ్‌పల్లి పాలిటెక్నిక్ కాలేజీ బృందం ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపింది. త్వరలో https://tgpolycet.nic.in ఫేజ్-1 రిజల్ట్ డిస్ ప్లే చేయబడతాయని పేర్కొంది. రిపోర్టింగ్ కోసం తేదీలు పొడగించే అవకాశం ఉందని తెలిపింది.
Similar News
News July 7, 2025
నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి: హరీశ్ రావు

TG: రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘20 నెలలుగా రాష్ట్రంలో పాలన కుంటుపడింది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా AP నీటిని తరలించుకుపోతోంది. కానీ ఇక్కడి కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి నీటిని వాడుకోవడం రేవంత్‌కు చేతకావట్లేదు. కాంగ్రెస్ సర్కారు గురించి ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది’ అని అన్నారు.
News July 7, 2025
ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్.. అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలలో నమ్మకం కలిగించాలని చెప్పారు. జిల్లా అధికారులు ప్రతి వారం మండల అధికారులతో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించాలన్నారు.
News July 7, 2025
నిర్మల్: పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత: కలెక్టర్

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. ఆమె నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో పలు రకాల మొక్కలను నాటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని ఆమె అన్నారు. “వనం ఉత్సవాలలో” భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అందరూ మొక్కలు నాటాలని కోరారు.