News July 7, 2025
హుజూర్‌నగర్: ట్రాక్టర్ పైనుంచి పడి మహిళా కూలీ మృతి

ట్రాక్టర్ పైనుంచి జారిపడి మహిళా కూలీ మృతిచెందిన ఘటన రఘునాథపాలెంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. హుజూర్‌నగర్(M) గోపాలపురానికి చెందిన అలకుంట నవనీత(27) ఇంటి స్లాబ్ పనికి వెళ్లి ఆదివారం సాయంత్రం తిరిగి వస్తుండగా మట్టంపల్లి(M) రఘునాధపాలెం గ్రామశివారులో డ్రైవర్ అకస్మాత్తుగా కటింగ్ ఇవ్వడంతో ట్రాక్టర్‌పై కూర్చున్న ఆమె అదుపుతప్పి కింద పడిపోయింది. తీవ్ర గాయాలైన నవనీతను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.
Similar News
News July 7, 2025
సిద్దిపేట: ‘బకాయిలను వెంటనే విడుదల చేయాలి’

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేటలోని పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అభిషేక్, భాను, రంజిత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో రూ.8,000 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజ్ రియంబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
News July 7, 2025
అనంతలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిప్పే స్వామి (52) సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బెళుగుప్ప మండలం ఎర్రగుడికి చెందిన తిప్పేస్వామి ఆదివారం కణేకల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News July 7, 2025
వార్-2 జర్నీలో ఎంతో నేర్చుకున్నా: Jr.NTR

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ‘వార్-2’పై యంగ్ టైగర్ NTR అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ పూర్తైందని తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘హృతిక్ సర్‌తో సెట్‌లో ఉంటే ఎప్పుడూ బ్లాస్టే. ఆయన ఎనర్జీ చాలా ఇష్టం. వార్-2 జర్నీలో ఎంతో నేర్చుకున్నా. ఆడియన్స్‌కు డైరెక్టర్ అయాన్ పెద్ద సర్‌ప్రైజ్ ప్యాకేజ్ సిద్ధం చేశారు. టీమ్‌కు థాంక్స్. AUG 14న ఈ ఫీల్‌ను మీరు ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు.