News July 7, 2025
జీకేవిధి: థాంక్యూ లోకేశ్ సార్..!

అల్లూరి జిల్లా జికేవీధి మండలం రింతాడ గిరిజన సంక్షేమ పాఠశాల బాలికలు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన యోగేంద్ర కార్యక్రమంలో గిరిజన బాలబాలికలు పాల్గొని గిన్నిస్ రికార్డు నమోదు చేయడానికి భాగస్వామ్యులయ్యారు. ఈ మేరకు గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు మంత్రి లోకేష్ టీ షర్ట్లు యోగ సామగ్రి పంపించారు. రింతాడలో సోమవారం ఆ టీ షర్ట్స్ ధరించిన విద్యార్థినిలు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News July 7, 2025
ప్రభుత్వాన్ని నిలదీయాలి: గుడివాడ అమర్నాథ్

వైసీపీ శ్రేణులు సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డులో సోమవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. కూటమి నాయకులు లేనిపోని హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా హామీలను అమలు చేయలేదని విమర్శించారు. హామీలు అమలుకు కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.
News July 7, 2025
ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు: కలెక్టర్

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ హాలులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఉచిత ఇసుక రవాణాలో అక్రమాలకు తావు లేకుండా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు.
News July 7, 2025
మహిళలు శక్తిమంతులు: సిద్దిపేట కలెక్టర్

మహిళలు శక్తిమంతులని, వారి పనికి వెలకట్టలేమని, వర్తక, వ్యాపార రంగంలోనూ ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులో జిల్లా మహిళా సమాఖ్య భవనంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు అనే కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా సమాఖ్య భవనం ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మొక్కలు నాటారు.