News July 7, 2025
వరంగల్: వారికి పెన్షన్లు ఎప్పుడు వచ్చెనో..?

ఉమ్మడి జిల్లాలో పలువురు దివ్యాంగులకు ఏళ్ల తరబడి పెన్షన్లు అందడం లేదు. గతంలో జిల్లా స్థాయి మెడికల్ బోర్డులో తిరస్కరించగా.. దానిపై రాష్ట్ర మెడికల్ బోర్డుకు కొందరు దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 375, జనగామలో 90 అప్పీళ్లు ఉన్నాయి. HNK, BHPL, WGL, ములుగులోను వంద లోపు అప్పీళ్లు వచ్చాయి. వాటిని పరిష్కరించి, పథకాలకు అర్హులుగా అయ్యేలా చూడాలని దివ్యాంగులు కోరుతున్నారు.
Similar News
News July 7, 2025
నంద్యాల: గ్రీవెన్స్ డేకు 75 ఫిర్యాదులు

బొమ్మలసత్రం వద్ద ఉన్న నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సోమవారం జరిగింది. ప్రజల నుంచి 75 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. వీటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
News July 7, 2025
ఆరోగ్యం రొట్టె స్వీకరించిన లోకేశ్.. ఎందుకంటే?

AP: నెల్లూరు రొట్టెల పండుగలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ ఆరోగ్యం రొట్టెను స్వీకరించారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలనే దాన్ని తీసుకున్నానని, ఆయన ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా సంతోషంగా ఉండాలని కూటమి ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. రొట్టెల పండుగ కోసం రూ.10 కోట్లు కేటాయించినట్లు లోకేశ్ వెల్లడించారు.
News July 7, 2025
‘కాలేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదు’

కాలేశ్వరం ప్రాజెక్టుపై BRS నేతలకు మాట్లాడే నైతికహక్కు లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, MLC కోదండరాం అన్నారు. శంకరపట్నం మండలంలోని మొలంగూర్‌లో జరిగిన ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పర్యాటక అభివృద్ధి గురించి చర్చించారు. ఇందుకు కృషి చేస్తామని తెలిపారు. BRS ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం యువనాయకులు పనిచేయాలన్నారు.