News July 7, 2025

కొత్త రైల్వే లైన్లకు సిద్ధమవుతున్న DPRలు

image

TG: డోర్నకల్-గద్వాల, డోర్నకల్-మిర్యాలగూడ మధ్య కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి DPRలు తుది దశకు చేరుకున్నాయి. ఆగస్టు నెలాఖరుకు ఇవి రైల్వే బోర్డుకు చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ 2 లేన్ల నిర్మాణానికి రూ.7,460 కోట్లు ఖర్చవుతుందని అధికారుల అంచనా. డోర్నకల్-గద్వాల లైన్‌ను కాచిగూడ రైల్వే లైన్‌కు, డోర్నకల్-మిర్యాలగూడ రైల్వే లైన్‌ను గుంటూరు-BBనగర్ లైన్‌కు లింక్ చేస్తారు.

Similar News

News July 7, 2025

నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి: హరీశ్ రావు

image

TG: రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘20 నెలలుగా రాష్ట్రంలో పాలన కుంటుపడింది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా AP నీటిని తరలించుకుపోతోంది. కానీ ఇక్కడి కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి నీటిని వాడుకోవడం రేవంత్‌కు చేతకావట్లేదు. కాంగ్రెస్ సర్కారు గురించి ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది’ అని అన్నారు.

News July 7, 2025

మస్క్ కొత్త పార్టీ.. పడిపోయిన టెస్లా షేర్లు

image

బిలియనీర్ ఎలాన్ మస్క్ USలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించడంతో ఇవాళ ప్రీమార్కెట్లో టెస్లా షేర్లు 7% పడిపోయాయి. మస్క్ నిర్ణయంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత వారాంతంలో $315.35 వద్ద ముగిసిన షేరు ధర తాజాగా $291.96కు పడిపోయింది. ఈ ట్రెండ్ కొనసాగితే సంస్థకు భారీ నష్టాలు తప్పవు. టెస్లా షేర్లు గత ఐదేళ్లలో ఇన్వెస్టర్లకు 206%కు పైగా లాభాలను తెచ్చిపెట్టడం గమనార్హం.

News July 7, 2025

రాష్ట్రంలో ఘోరం.. ప్రియురాలిని పొడిచి చంపిన ప్రేమోన్మాది

image

TG: సంగారెడ్డి బండ్లగూడలో ప్రేమోన్మాది ప్రవీణ్ రెచ్చిపోయాడు. ప్రియురాలు రమ్యపై కత్తితో దాడి చేసి హత్యచేశాడు. కొన్నాళ్లుగా తనను దూరం పెడుతోందని రగిలిపోయిన ప్రవీణ్ ఆమెతో మాట్లాడేందుకు ఇవాళ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలోనే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించింది. అనంతరం తానూ అదే కత్తితో మెడ కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.