News March 30, 2024

ఖమ్మం-బెంగళూరుకు లహరి ఏసీ బస్సులు

image

ఖమ్మం నుంచి బెంగళూరుకి లహరి ఏసి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను నడుపుతున్నట్లు DM శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మం నుంచి సాయంత్రం 3 గంటలకు, 4.30 గంటలకు లహరీ బస్సు బయలుదేరుతుందన్నారు. బెంగళూరు నుంచి రాత్రి 6.30 గంటలకు, 7:45 గంటలకు బయలుదేరుతుందన్నారు. చార్జీల వివరాలు సీటుకు రూ. 1580, బెర్త్ కు రూ .2010 ఉందని తెలిపారు

Similar News

News November 8, 2025

ఖమ్మం: గన్ని సంచుల కొరత లేదు: అదనపు కలెక్టర్

image

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు గన్ని సంచులు సమృద్ధిగా ఉన్నాయని, ప్రతిపాదనలు పంపిన 48 గంటల్లోనే సరఫరా జరుగుతోందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలకు 9,71,500 గన్ని సంచులు పంపిణీ చేశామన్నారు. రైతుల ఇళ్లకు సంచులు ఇవ్వవద్దని స్పష్టమైన ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు, టార్పాలిన్ కవర్లు సమృద్ధిగా ఉన్నాయన్నారు.

News November 8, 2025

ఖమ్మం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇన్‌ఛార్జి హల్చల్

image

ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఇన్‌ఛార్జి అధికారి హడావుడి కలకలం రేపింది. సెలవులో ఉన్న రెగ్యులర్ డీఎంహెచ్‌ఓ పేరుతోనే ఆయన ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ‘నేనే డీఎంహెచ్‌ఓ’ అంటూ సిబ్బందితో చెప్పడం, ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీ కమిటీలో తన అనుచరులకే చోటు కల్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదాస్పద తీరుపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

News November 8, 2025

ఖమ్మం: సైబర్ నేరగాళ్లకు 23 నెలల జైలు

image

సైబర్ నేరాలకు పాల్పడిన రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు నిందితులకు ఖమ్మం కోర్టు శిక్ష ఖరారు చేసింది. నిందితులు మహిర్ అజాద్(25), వకీల్(22)పై కేసు నమోదు చేసి, సీపీ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీసులు సాక్ష్యాలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో వారి నేరం నిర్ధారణ కావడంతో న్యాయమూర్తి పి.నాగలక్ష్మి నిందితులకు 23 నెలల 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.