News July 7, 2025
నూజివీడు: అధికారులపై సబ్ కలెక్టర్ ఆగ్రహం

నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నేడు జరిగింది. సకాలంలో అన్ని శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో సబ్ కలెక్టర్ స్మరణ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం ఏర్పాటు చేస్తే అధికారులు సరైన సమయానికి రాలేదు. ఇలాంటి ఘటనలు పునారవృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News July 7, 2025
నంద్యాల జిల్లా నేటి ముఖ్యమైన వార్తలు

☞ నంద్యాల: గ్రీవెన్స్‌డేకు 75 ఫిర్యాదులు
☞ రేపు శ్రీశైలానికి రానున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు.!
☞ డెంగ్యూ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
☞ లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి: CITU
☞ మహానంది: విద్యుత్ ఘాతంతో పూరి గుడిసె దగ్ధం
☞ అసెస్మెంట్ శిబిరంను సద్వినియోగం చేసుకోండి: ఎంపీ బైరెడ్డి శబరి
News July 7, 2025
రేపు శ్రీశైలంలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

AP: CM చంద్రబాబు శ్రీశైలం పర్యటన షెడ్యూల్ విడుదలైంది. రేపు ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 11గం.లకు శ్రీశైలం చేరుకుని మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12గం.కు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకొని కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు. గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటి విడుదలను ప్రారంభిస్తారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు. మ.2.30కి అమరావతికి వెళ్తారు.
News July 7, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> దేవరుప్పుల: గుండెపోటుతో ఉపాధి హామీ ఏపీవో మృతి
> జనగామ: పారిశుద్ధ్య నిర్వహణపై బీఆర్ఎస్ నిరసన
> పాలకుర్తిలో కోతుల బీభత్సం.. రైతుల ఇక్కట్లు
> MLA పల్లాను పరామర్శించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి
> జనగామ కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ నేతల ధర్నా
> జనగామ: ప్రజావాణిలో కన్నీరు పెట్టుకున్న దివ్యాంగుడు
> జీవో 282 రద్దు చేయాలని జనగామలో ధర్నా
> నర్సింగాపురం వాసికి ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్