News March 30, 2024
రేపు మార్కాపురానికి చంద్రబాబు రాక

ప్రజా గళంలో భాగంగా ఈనెల 31వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మార్కాపురం పట్టణానికి రానున్నట్లు మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగే సభలో పాల్గొని అక్కడినుంచి హెలికాప్టర్‌లో మార్కాపురం చేరుకుంటారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Similar News
News January 7, 2026
మెరుగైన వసతుల కల్పనకు కృషి: కలెక్టర్

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించడంతోపాటు మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం రాదని, అధికారులు ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు.

News January 6, 2026
మార్కాపురం జిల్లాకు 59 మంది ఇన్‌ఛార్జ్ అధికారులు

మార్కాపురం నూతన జిల్లా ఏర్పడిన రోజు ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన అధికారులను జిల్లా ఇన్‌ఛార్జ్ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నూతన జిల్లాకు ప్రస్తుతం వివిధ శాఖలకు చెందిన 59 మంది ఇన్‌ఛార్జ్ జిల్లా అధికారులను నియమించారు.