News July 7, 2025

మహబూబ్ నగర్ IIIT.. నేడు కౌన్సెలింగ్

image

మహబూబ్ నగర్‌లోని నూతనంగా ఏర్పాటు చేసిన IIITలో 181 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి 66 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. నేడు S.NO:1 నుంచి 564 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని పేర్కొన్నారు. సందేహాలు ఉంటే E-Mail admissions@rgukt. ac.in, 90525 95661,73825 95661 సంప్రదించాలన్నారు. SHARE IT

Similar News

News July 8, 2025

మెదక్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణికి 11 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News July 7, 2025

నంద్యాల జిల్లా నేటి ముఖ్యమైన వార్తలు

image

☞ నంద్యాల: గ్రీవెన్స్‌డేకు 75 ఫిర్యాదులు
☞ రేపు శ్రీశైలానికి రానున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు.!
☞ డెంగ్యూ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
☞ లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి: CITU
☞ మహానంది: విద్యుత్ ఘాతంతో పూరి గుడిసె దగ్ధం
☞ అసెస్మెంట్ శిబిరంను సద్వినియోగం చేసుకోండి: ఎంపీ బైరెడ్డి శబరి

News July 7, 2025

రేపు శ్రీశైలంలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

image

AP: CM చంద్రబాబు శ్రీశైలం పర్యటన షెడ్యూల్ విడుదలైంది. రేపు ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 11గం.లకు శ్రీశైలం చేరుకుని మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12గం.కు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకొని కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు. గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటి విడుదలను ప్రారంభిస్తారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు. మ.2.30కి అమరావతికి వెళ్తారు.