News July 7, 2025
జగన్ పర్యటనకు పోలీసుల అనుమతి

AP: వైసీపీ అధినేత జగన్ ఎల్లుండి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. మామిడి రైతులను పరామర్శించే మార్కెట్ యార్డు చిన్నది కావడంతో జగన్‌తో పాటు 500 మంది మాత్రమే ఉండాలని ఆంక్షలు విధించారు. పర్యటనలో ఎలాంటి ర్యాలీలు, రోడ్‌షోలు చేయకూడదని నిబంధన పెట్టారు. గత పర్యటనల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు జాగ్రత్తలు పాటిస్తున్నారు.
Similar News
News July 7, 2025
రేపు శ్రీశైలంలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

AP: CM చంద్రబాబు శ్రీశైలం పర్యటన షెడ్యూల్ విడుదలైంది. రేపు ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 11గం.లకు శ్రీశైలం చేరుకుని మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12గం.కు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకొని కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు. గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటి విడుదలను ప్రారంభిస్తారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు. మ.2.30కి అమరావతికి వెళ్తారు.
News July 7, 2025
‘నీకు మతి ఉండే నా తలరాత రాశావా?’ అని దేవుడికి లేఖ రాసి..

TG: వేములవాడకు చెందిన దీటి రోహిత్(23) ఆత్మహత్యకు ముందు దేవుడి(శివుడు)కి రాసిన లేఖ కదిలిస్తోంది. ‘నీకు మతి ఉండే నా తలరాత రాశావా? నీ కొడుకు తలరాత అలా రాయలేదే! మేం కొడుకులం కాదా?’ అని ప్రశ్నించాడు. ‘బెస్ట్ సూసైడ్ లెటర్ రాయాలన్న నా కోరిక ఇప్పుడు నెరవేరింది. మరో జన్మ వద్దు’ అంటూ రాసుకొచ్చాడు. కుటుంబ పరిస్థితుల వల్ల డాక్టర్ అవ్వాలన్న తన కోరిక తీరకపోవడంతోనే రోహిత్ బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది.
News July 7, 2025
ఇండియన్ ముస్లింలు బందీలు.. సిటిజన్లు కాదు: ఒవైసీ

మైనార్టీలకే ఎక్కువ బెనిఫిట్స్, రక్షణలు ఉన్న ఏకైక దేశం ఇండియానే అని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన ట్వీట్‌పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఫైరయ్యారు. అవి తమ హక్కులని, చారిటీ కాదని ట్వీట్ చేశారు. ‘మీరు మంత్రి.. చక్రవర్తి కాదు. పాకిస్థానీ, బంగ్లాదేశీ, జీహాదీ, రోహింగ్యా అని పిలిపించుకోవడం బెనిఫిట్ అంటారా? ఇండియన్ మైనారిటీలు కనీసం సెకండ్ క్లాస్ సిటిజన్స్ కూడా కాదు. మేము బందీలం’ అని వ్యాఖ్యానించారు.