News March 30, 2024

కాలేజీ విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసు

image

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ అనే విద్యార్థి బ్యాంక్ అకౌంట్‌ నుంచి ఏకంగా రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీంతో ఆ మొత్తానికి పన్ను చెల్లించాలంటూ IT శాఖ నోటీసులు పంపడంతో యువకుడు కంగుతిన్నాడు. తన పాన్‌కార్డుతో ఓ కంపెనీ రిజిస్టర్ అయ్యిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2021 నుంచి ముంబై, ఢిల్లీలో ఆ కంపెనీ వ్యాపారాలు చేసిందట. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 20, 2026

ఆస్తి పంపకాలలో వాస్తు సూచనలు

image

కుటుంబంలో ఆస్తి పంపకాలప్పుడు మనస్పర్థలు రాకుండా ఉండేందుకు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు కొన్ని సూచనలు చేశారు. అవి.. ఖాళీ స్థలాల విభజనలో తూర్పు, ఉత్తరం దిశల్లో చిన్నవారు ఉండాలి. పడమర, దక్షిణం దిశల్లో పెద్దవారు ఉండాలి. ఈ పద్ధతిని అనుసరిస్తే సోదరుల మధ్య ఐక్యత దెబ్బతినదు. ఇలా శాస్త్రోక్తంగా దిశలు కేటాయిస్తే అనవసర తగాదాల తగ్గుతాయి. ఇలా కుటుంబంలో ప్రశాంతతను, ఆర్థికాభివృద్ధిని పెంపొందించుకోవచ్చు. <<-se>>#Vasthu<<>>

News February 20, 2026

‘ఒకే గ్రూప్‌లో టాప్ టీమ్సా?’.. ప్రీసీడింగ్‌పై ఫ్యాన్స్ అసంతృప్తి

image

టీ20 ప్రపంచకప్‌లోని ప్రీసీడింగ్‌ పద్ధతిపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టేబుల్ టాపర్స్‌గా నిలిచిన ఇండియా, జింబాబ్వే, విండీస్, సౌతాఫ్రికా ఓకే గ్రూప్‌లో ఉండటం సరికాదంటున్నారు. కాగా మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లు, టికెట్ల అందుబాటులో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రీసీడింగ్ పద్ధతిని 2024లో ICC తీసుకొచ్చింది. క్వాలిఫైడ్ జట్లకు గ్రూప్ స్టేజ్‌లో, సూపర్-8లో నిర్ణీత స్లాట్లను ICC కేటాయిస్తోంది.

News February 20, 2026

విడాకులు ప్రకటించిన రాహుల్ చాహర్

image

IND క్రికెటర్ రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహర్‌తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ‘కొన్ని బంధాలు చాలాకాలం నిలిచి ఉండవు. కానీ మనల్ని మేల్కొలుపుతాయి. కొత్త విషయాలు నేర్పుతాయి. మార్పు తీసుకొస్తాయి. నేను కోపం, బాధతో కాకుండా క్లారిటీతో ఈ నిర్ణయం తీసుకున్నా’ అని SMలో రాసుకొచ్చారు. కాగా వీరిద్దరూ 2019లో ఎంగేజ్‌మెంట్, 2022లో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది రాహుల్ IPLలో CSK తరఫున ఆడనున్నారు.