News July 7, 2025
జగిత్యాల జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

జగిత్యాల జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు. అత్యధికంగా బీర్పూర్ మండలం కొల్వాయిలో 23.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా అత్యల్పంగా కొడిమ్యాల మండలం పూడూరులో 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జగిత్యాలలో 18.5, మల్లాపూర్ 16, మేడిపల్లి 13.5, వెల్గటూర్ 11.3 సారంగాపూర్ 10, కథలాపూర్ 9.8, మెట్‌పల్లి, ఎండపల్లిలో 9.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
Similar News
News July 8, 2025
మెదక్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణికి 11 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News July 7, 2025
నంద్యాల జిల్లా నేటి ముఖ్యమైన వార్తలు

☞ నంద్యాల: గ్రీవెన్స్‌డేకు 75 ఫిర్యాదులు
☞ రేపు శ్రీశైలానికి రానున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు.!
☞ డెంగ్యూ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
☞ లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి: CITU
☞ మహానంది: విద్యుత్ ఘాతంతో పూరి గుడిసె దగ్ధం
☞ అసెస్మెంట్ శిబిరంను సద్వినియోగం చేసుకోండి: ఎంపీ బైరెడ్డి శబరి
News July 7, 2025
రేపు శ్రీశైలంలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

AP: CM చంద్రబాబు శ్రీశైలం పర్యటన షెడ్యూల్ విడుదలైంది. రేపు ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 11గం.లకు శ్రీశైలం చేరుకుని మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12గం.కు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకొని కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు. గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటి విడుదలను ప్రారంభిస్తారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు. మ.2.30కి అమరావతికి వెళ్తారు.