News July 7, 2025
HYD: హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే: కమిషనర్

హైడ్రా విజన్ అండ్ ఎజెండా అంశంపై ‘ప్రశ్నలు–జవాబులు’ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటుందన్నారు. దేశ- విదేశాల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, హైడ్రాకు 169 పోస్టులు శాంక్షన్ కాగా, ప్రస్తుతం కేవలం 45 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇంకా రెండు వేల మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ద్వారా సేవలందిస్తున్నామన్నారు.
Similar News
News July 7, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> దేవరుప్పుల: గుండెపోటుతో ఉపాధి హామీ ఏపీవో మృతి
> జనగామ: పారిశుద్ధ్య నిర్వహణపై బీఆర్ఎస్ నిరసన
> పాలకుర్తిలో కోతుల బీభత్సం.. రైతుల ఇక్కట్లు
> MLA పల్లాను పరామర్శించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి
> జనగామ కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ నేతల ధర్నా
> జనగామ: ప్రజావాణిలో కన్నీరు పెట్టుకున్న దివ్యాంగుడు
> జీవో 282 రద్దు చేయాలని జనగామలో ధర్నా
> నర్సింగాపురం వాసికి ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్
News July 7, 2025
బొల్లాపల్లి: మహిళ దారుణ హత్య

బొల్లాపల్లి మండలంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మేళ్లవాగుకు చెందిన కృష్ణ కుమారి పొలంలో దారుణంగా హత్యకు గురైనట్లు స్థానికులు తెలిపారు. ఆమె ముఖంపై పదునైన ఆయుధంతో నరికి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న బండ్లమోట్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 7, 2025
మెదక్: పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి: టీపీటీఎఫ్

బదిలీలతోపాటు పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. మెదక్‌లోని ఉపాధ్యాయ భవన్‌లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, నగదు రహిత వైద్యం అందించాలని, పెండింగ్‌లో ఉన్న 4విడతల డీఏను విడుదల చేయాలన్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి, మాజీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి ఉన్నారు.