News July 7, 2025
HYD: NIMS ఆసుపత్రిలో OP తీసుకోవడం ఇక చాలా ఈజీ.!

HYD పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో OP తీసుకోవాలంటే గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి ఉండే పరిస్థితి గతంలో ఉండేది.
ఇప్పుడు ఆ పరిస్థితికి అధికారులు చెక్ పెట్టారు. ఆసుపత్రిలో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసి OP రిజిస్ట్రేషన్ పూర్తి చేసి స్లిప్పు అందించే ఏర్పాటు చేశారు. ఈ యంత్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే స్లిప్పు వచ్చేస్తుంది. దీంతో సేవలు చాలా ఈజీగా అవుతాయని అధికారులు తెలిపారు.
Similar News
News July 8, 2025
కాంగ్రెస్ HYD, RR జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు

TGలో కాంగ్రెస్ సంస్థాగత పునర్నిర్మాణం దిశగా కీలక అడుగు వేసింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. AICC TG ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదంతో జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. HYD జిల్లాకు జగ్గారెడ్డి, ఉమ్మడి RRకు శివసేనా రెడ్డిని నియమించారు. వీరి నియామకంతో అధికార పార్టీకి సిటీ, శివారులో పట్టు దొరుకుతుందని శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News July 8, 2025
విఠలేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్సీ కవిత

పురాణాపూల్‌లోని విఠలేశ్వర స్వామి ఆలయంలో సోమవారం జరిగిన కళ్యాణోత్సవంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయ నిర్వహణపై ఆలయ పూజారులతో ఆమె చర్చించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు, నాయకులు పాల్గొన్నారు.
News July 8, 2025
ప్రజావాణిలో సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సూచనలు

లక్డికాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి అందిన అర్జీలను కలెక్టర్ హరిచందన దాసరి సమీక్షించారు. కలెక్టర్ అధికారులను ఉద్దేశించి అన్ని సమస్యలు వేగంగా పరిష్కరించాలని, పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాక్షికంగా కాకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆమె సూచించారు.