News July 7, 2025

రాంపల్లిలో రోడ్డు ప్రమాదం.. తలమీద నుంచి వెళ్లిన లారీ

image

నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాంపల్లిలోని వీఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద లారీ కింద పడి వ్యక్తి దుర్మరణం చెందాడు. బైక్‌ మీద వస్తున్న వ్యక్తి స్కిడ్ అయి పడిపోవడంతో వెనుక నుంచి వస్తున్న లారీ ఆయన తలపై ఎక్కింది. దీంతో స్పాట్‌లోనే మృతి చెందాడు. మృతుడు నారపల్లికి చెందిన బాసిత్‌గా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News July 8, 2025

వైద్యులకు మహబూబాబాద్ DMHO హెచ్చరిక

image

అర్హతకు మించి వైద్యం చేయరాదని DMHO హెచ్చరించారు. మరిపెడలోని రవి బాబు నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి రోగులకు వైద్యాధికారి అందిస్తున్న చికిత్స విధానాన్ని పరిశీలించగారు. ఈ క్రమంలో ఎలాంటి అర్హతలు లేకుండా రోగులకు స్టెరాయిడ్ ఇంజిక్షన్లు, యాంటీ బయాటిక్‌లు, సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తూ చికిత్స చేస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూరవి బాబు క్లినిక్‌ను సీజ్ చేశారు.

News July 8, 2025

HNK: గడువు దాటిన చెక్కులు పంపిణీ చేసిన MLA కౌశిక్ రెడ్డి

image

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గడువు దాటిన కళ్యాణ లక్ష్మి చెక్కులను సోమవారం పంపిణీ చేశారని లబ్ధిదారులు తెలిపారు. బ్యాంకులో వేయడానికి వెళ్తే తీరా గడువు దాటిందని సిబ్బంది చెప్పడంతో ఆవాక్కయ్యారన్నారు. అయితే ఆ చెక్కుల్లో కొన్ని గడువు దాటాయని, మరికొన్ని బానే ఉన్నట్లు బాధితులు తెలిపారు. సకాలంలో పంపిణీ చేయాల్సిన చెక్కులను గడువు దాటిన తర్వాత పంపిణీ చేయడానికి కారణమేంటని మండిపడుతున్నారు.

News July 8, 2025

జులై 8: చరిత్రలో ఈరోజు

image

1497: భారత్‌కు వాస్కోడగామా ప్రయాణం ప్రారంభించిన రోజు
1914: బెంగాల్ దివంగత మాజీ సీఎం జ్యోతి బసు జననం
1919: తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు మరణం
1921: దివంగత పారిశ్రామిక వేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం
1949: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం YS రాజశేఖర రెడ్డి జయంతి
1966: సినీ నటి రేవతి జననం
1972: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జననం
1978: తొలితరం భావకవి నాయని సుబ్బారావు మరణం