News July 7, 2025
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను https://navodaya.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ప్రవేశాలకు డిసంబర్ 13న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News July 8, 2025
HNK: గడువు దాటిన చెక్కులు పంపిణీ చేసిన MLA కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గడువు దాటిన కళ్యాణ లక్ష్మి చెక్కులను సోమవారం పంపిణీ చేశారని లబ్ధిదారులు తెలిపారు. బ్యాంకులో వేయడానికి వెళ్తే తీరా గడువు దాటిందని సిబ్బంది చెప్పడంతో ఆవాక్కయ్యారన్నారు. అయితే ఆ చెక్కుల్లో కొన్ని గడువు దాటాయని, మరికొన్ని బానే ఉన్నట్లు బాధితులు తెలిపారు. సకాలంలో పంపిణీ చేయాల్సిన చెక్కులను గడువు దాటిన తర్వాత పంపిణీ చేయడానికి కారణమేంటని మండిపడుతున్నారు.
News July 8, 2025
జులై 8: చరిత్రలో ఈరోజు

1497: భారత్‌కు వాస్కోడగామా ప్రయాణం ప్రారంభించిన రోజు
1914: బెంగాల్ దివంగత మాజీ సీఎం జ్యోతి బసు జననం
1919: తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు మరణం
1921: దివంగత పారిశ్రామిక వేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం
1949: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం YS రాజశేఖర రెడ్డి జయంతి
1966: సినీ నటి రేవతి జననం
1972: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జననం
1978: తొలితరం భావకవి నాయని సుబ్బారావు మరణం
News July 8, 2025
ఆర్టీసీ వరంగల్-2 డిపో డీఎంగా రవిచందర్

వరంగల్ రీజియన్‌లోని వరంగల్-2 డిపో మేనేజర్‌గా ఎం.రవిచందర్‌ను నియమిస్తూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం వరంగల్-2 డిపో మేనేజర్‌గా పనిచేసిన జ్యోత్స్న ఖమ్మం రీజియన్ ఏవోగా బదిలీ అయ్యారు. దీంతో పరకాల డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న రవిచందర్‌ను వరంగల్-2 డిపోకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి.