News July 7, 2025

స్థానిక సంస్థలపై ఫోకస్: రామ్‌చందర్ రావు

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తమకు సవాల్ అని BJP రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు అన్నారు. బలమైన ప్రతిపక్షం ఉంటే బైఎలక్షన్‌లో అధికార పార్టీ గెలవదని జోస్యం చెప్పారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలపై BJP ఫోకస్ చేయలేదని, ఈ సారి వీటిపై ఫోకస్ పెడతామని స్పష్టం చేశారు. 25 రోజుల్లో పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్ర కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

Similar News

News July 8, 2025

నిధికి పెళ్లి ప్రపోజల్.. హీరోయిన్ క్యూట్ రిప్లై

image

సాధారణంగా సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ తారలు నెట్టింట అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. అలాగే, హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా #asknidhhi అంటూ ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశారు. నెటిజన్స్ అంతా నిధి హీరోయిన్‌గా చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా విశేషాలు అడిగారు. ఒకరు మాత్రం ‘మీ అమ్మగారి నంబరిస్తే మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతా’ అని అన్నారు. అందుకు నిధి ‘అవునా? నాటీ’ అంటూ క్యూట్‌గా రిప్లయ్ ఇచ్చారు.

News July 8, 2025

జులై 8: చరిత్రలో ఈరోజు

image

1497: భారత్‌కు వాస్కోడగామా ప్రయాణం ప్రారంభించిన రోజు
1914: బెంగాల్ దివంగత మాజీ సీఎం జ్యోతి బసు జననం
1919: తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు మరణం
1921: దివంగత పారిశ్రామిక వేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం
1949: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం YS రాజశేఖర రెడ్డి జయంతి
1966: సినీ నటి రేవతి జననం
1972: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జననం
1978: తొలితరం భావకవి నాయని సుబ్బారావు మరణం

News July 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.