News July 7, 2025

నిజామాబాద్: ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్

image

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజయేందర్ పాల్గొన్నారు.

Similar News

News July 8, 2025

ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలు నిర్వహించాలి: కలెక్టర్

image

ఈ నెల 10 నుంచి 16 వరకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలను జిల్లాలో పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం ఆయన జిల్లా సమాఖ్య సమావేశంలో మాట్లాడుతూ.. విజయోత్సవ సంబరాల సన్నద్ధత, కార్యాచరణ కోసం ఈ నెల 8న అన్ని మండలాలలో మండల సమాఖ్య సమావేశాలు, 9న గ్రామ సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

News July 7, 2025

NZB: అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి

image

నిజామాబాద్ మొదటి జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అనంతగిరికి చెందిన నర్సింహారెడ్డి ఇంటర్మీడియట్ విద్యను ఖిల్లా కళాశాలలో, డిగ్రీ, లా ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కోర్టులో సుదీర్ఘకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.

News July 7, 2025

NZB: రైలు ఢీకొని మహిళ మృతి

image

రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే SI సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్-జానకంపేట్ మధ్య KM.No 456-14 సమీపంలో ఆదివారం ఓ మహిళ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింనట్లు పేర్కొన్నారు. ఆమె సంబంధించిన వివరాలు తెలిస్తే రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.