News March 30, 2024

ఎల్లుండి జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల

image

జేఈఈ మెయిన్-2024 సెషన్-2 అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు NTA ప్రకటించింది. https://jeemain.nta.ac.in/ వెబ్‌సైట్‌లో వీటిని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 319 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 1 (BE/BTECH) పరీక్షలు ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో జరగనుండగా, పేపర్-2 పరీక్షలు ఏప్రిల్ 12న నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న ఫలితాలు రానున్నాయి.

Similar News

News April 1, 2026

అమరావతి బిల్లుపై చర్చకు YCP

image

పార్లమెంటులో ఇవాళ ప్రవేశపెట్టే రాజధాని అమరావతి బిల్లుపై చర్చలో వైసీపీ పాల్గొననుంది. ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీలు కలిశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చర్చకు ఉంటుందని ఎంపీలతో స్పీకర్ చెప్పారు.

News April 1, 2026

రాష్ట్రంలో 14,553 పోలీస్ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

image

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. కొత్తగా సంస్థాన్ నారాయణపూర్, ఆమన్‌గల్‌లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి అవసరమైన సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో మొత్తం 14,553 కానిస్టేబుళ్లు, ఎస్సైల కోసం పోలీస్ శాఖ రిక్రూట్‌మెంట్‌ చేపట్టనుంది. ఇందుకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది.

News April 1, 2026

SBI అకౌంట్ వాడుతున్నారా.. కాసేపట్లో..

image

ఖాతాదారులకు SBI బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 11.00 గంటల నుంచి 11.45 గంటల వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS సేవలు పనిచేయవని పేర్కొంది. మెయింటెనెన్స్‌ కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. ఖాతాదారులు UPI Lite, ATM ద్వారా సేవలు పొందొచ్చని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది.