News March 30, 2024
తాడేపల్లి: లారీ ఢీకొని కానిస్టేబుల్ మృతి

కంటైనర్ లారీ ఢీకొని ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఏఆర్ కానిస్టేబుల్ మోహన్ రావు గురువారం రాత్రి 11 గంటలకు విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ్తున్నారు. కొలనుకొండ సాయిబాబా మందిరం సమీపంలో లారీ వెనక నుండి ఢీకొట్టింది. మోహన్ రావు లారీ చక్రాల కింద పడి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News April 18, 2026
GNT: ఎండలు బాబోయ్.. ఉక్కబోతతో జనం ఉక్కిరి బిక్కిరి

గుంటూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకీ సూర్యప్రతాపం పెరిగిపోతూ రికార్డు స్ధాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. శనివారం 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల ధాటికి ప్రజలు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయటకు రావడానికే భయపడి పోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రాత్రి వేళల్లోనూ కొనసాగుతున్నాయి.
News April 18, 2026
GNT: CRDA గ్రీవెన్స్ డే మార్పు

రాజధాని అమరావతి రైతులు, కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడి APCRDA కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డే ఇకపై ప్రతి సోమవారం జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కమిషనర్, ఇతర అధికారులు అర్జీలు స్వీకరిస్తారు. గతంలో శనివారం నిర్వహించగా మార్పు చేశారు. రాయపూడి CRDAలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న సిటిజన్ గ్రీవెన్స్ సెంటర్ వద్ద రోజువారీగా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.
News April 18, 2026
GNT: వైసీపీలో ‘ఆధిపత్య’ రగడ.. అంబటి VS అప్పిరెడ్డి!

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా అంబటి బాధ్యతలు చేపట్టగా, స్థానికంగా అప్పిరెడ్డికి ఉన్న బలమైన అనుచరగణం ఇద్దరి మధ్య చిచ్చుకు కారణమవుతోంది. నియోజకవర్గ రహస్యాలు ప్రత్యర్థి వర్గానికి చేరుతున్నాయనే అనుమానంతో నేతల మధ్య గ్యాప్ పెరగడం, క్యాడర్‌లో గందరగోళానికి దారితీస్తోంది.


