News July 7, 2025

పెద్దపల్లి జిల్లాకు భారీ వర్ష సూచన

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈనెల 9 వరకు పెద్దపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీటి వనరులు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు అవసరమైతే తప్ప అత్యవసర ప్రయాణాలు చేయాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.

Similar News

News July 8, 2025

అడ్వాన్స్డ్ ఫీచర్లతో GROK 4.. జులై 8న రిలీజ్

image

xAI ఆవిష్కరించిన AI చాట్ బాట్ GROKలో కొత్త వర్షన్ రాబోతోంది. GROK 4 కొత్త రిలీజ్ డేట్‌ను ఎలాన్ మస్క్ ప్రకటించారు. జులై 4న జరగాల్సిన ఈ రిలీజ్ బుధవారం(జులై9)కి వాయిదా పడింది. రా.8 గంటలకు రిలీజ్ లైవ్ స్ట్రీమ్ ఉంటుందని మస్క్ ట్వీట్ చేశారు. ఇది ఓ స్పెషలైజ్డ్ కోడింగ్ మోడల్. డెవలపర్స్ కోసం కోడింగ్ ఆటో కంప్లీషన్, డీబగ్గింగ్, IDE ఇంటిగ్రేషన్ ఉంటుంది. రియల్‌టైమ్ డేటా, మల్టీ మోడల్ సపోర్టింగ్ కూడా ఉంటుంది.

News July 8, 2025

ఈ-ఆరోగ్యం నమోదులో కామారెడ్డి జిల్లాకు అగ్రస్థానం

image

కామారెడ్డి జిల్లా ఈ-ఆరోగ్యం ఆన్‌లైన్ అప్లికేషన్ నమోదులో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలోని 22 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 25,152 మంది చికిత్స పొందగా, 23,723 మంది డాక్టర్లను సంప్రదించారు. 5,232 మంది రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా 21,539 మంది ఔషధ సేవలు పొందారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, DMHO చంద్రశేఖర్ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

News July 8, 2025

15 ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్

image

జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, దీనికి అవసరమైన పటిష్ఠ ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, విద్యా శాఖ, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మధిరలో జి+2 మోడల్‌లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.