News March 30, 2024

పటాన్ చెరు: తల్లికి మాత్రలు తెచ్చేందుకు వెళ్లి విద్యార్థి మృతి

image

తల్లికి మాత్రలు తెచ్చేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన పటాన్ చెరులో జరిగింది. సీతారామపురం కాలనీలో ఉంటున్న సుదీప్ పట్నాయక్(15) పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి బాలుడి తల్లికి మాత్రలు తెచ్చేందుకు బైక్‌పై వెళ్లాడు. పెట్రోల్ బంకు వెళ్లి పెట్రోల్ పోయించుకుని తిరిగి వస్తుండగా ముందు వెళ్తున్న వాహనాన్ని బైక్ ఢీకొన్నాడు దీంతో బాలుడు మృతి చెందాడు.

Similar News

News March 26, 2026

మెదక్: హెల్మెట్, సీటుబెల్టు తప్పనిసరి: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అత్యంత కీలకమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మెదక్ టౌన్‌లోని బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో ‘Arrive Alive’ మూడో విడత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, యువతకు రోడ్డు భద్రతపై సూచనలు అందించారు. వాహనదారులు హెల్మెట్, సీటుబెల్టు ఉపయోగించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం, అధిక వేగం, సెల్‌ఫోన్ ఉపయోగం గురించి వివరించారు.

News March 26, 2026

మెదక్: అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీవోలు, తహశీల్దార్లు, మైనింగ్, ఇరిగేషన్, పంచాయతీ హౌసింగ్ అధికారులతో కలిసి పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి ఇసుక సరఫరా మన ఇసుక వాహనం ద్వారా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించాలని తెలిపారు.

News March 26, 2026

మెదక్: ఆరోగ్యశ్రీ కింద 600 కోట్లకుపైగా బకాయిలు: మంత్రి

image

ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఆరోగ్యశ్రీ కింద రూ.600 కోట్లకు పైగా, ఈహెచ్‌ఎస్ కింద రూ.130 కోట్ల బకాయిలు ఉన్నాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అసెంబ్లీ క్వశ్చన్ హవర్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 9.45 లక్షల మందికి ఉచిత వైద్యం అందించామని చెప్పారు. నెలకు సగటున రూ.89 కోట్లు చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు రూ.2400 కోట్లకు పైగా విడుదల చేశామని తెలిపారు.