News March 30, 2024

రాయలసీమకు ఏం చేశావ్ జగన్‌?: CBN

image

AP: సీఎం జగన్ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశావని జగన్‌కు సవాల్ విసురుతున్నా. జగన్‌కు సీమ అంటే హింస, హత్యా రాజకీయాలు. టీడీపీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు. మేం ‘కియా’ పరిశ్రమ తెస్తే.. జగన్ ‘జాకీ’, ‘అమర్ రాజా’ కంపెనీలను వెళ్లగొట్టారు’ అని విమర్శించారు.

Similar News

News March 18, 2026

ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిని చంపేశాం: ఇజ్రాయెల్

image

ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. టెహ్రాన్‌పై అర్ధరాత్రి జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో అతడు చనిపోయినట్లు వెల్లడించారు. ప్రధాని నెతన్యాహు ఆదేశాలతో ఇరాన్‌పై దాడులను ఉద్ధృతం చేశామని పేర్కొన్నారు. కాగా వరుసగా టాప్ లీడర్లు మరణిస్తున్నా తాము వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.

News March 18, 2026

IPL: ఈసారి ‘క్యాప్’ పెట్టుకునేదెవరో?

image

సీజన్‌లో అత్యధిక రన్స్, వికెట్లు తీసిన ప్లేయర్లకు ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు ఇస్తారు. గత 5 సీజన్లలో ఒక్కసారి(బ్యాటింగ్ విభాగంలో) మినహా అన్నీ ఇండియన్సే దక్కించుకున్నారు. 2021లో రుతురాజ్(635 రన్స్), హర్షల్ పటేల్(32 వికెట్లు), 2022లో బట్లర్(863), చాహల్(27), 2023లో గిల్(890), షమీ(28), 2024లో కోహ్లీ(741), హర్షల్(24), 2025లో సుదర్శన్(759), ప్రసిద్ధ్(25) గెలిచారు. ఈ సారి ఎవరిని వరిస్తాయనుకుంటున్నారు?

News March 18, 2026

99.93% ఓట్లతో కిమ్ విక్టరీ.. మరి వారి సంగతేంటో?

image

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆధ్వర్యంలోని వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించింది. 99.99%లో కిమ్‌కు ఫేవర్‌గా 99.93% ఓట్లు పడ్డాయి. ఇక 0.07% ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. దీంతో వారి గతేమవుతుందోనని SMలో మీమ్స్ పేలుతున్నాయి. ఎన్నికలు పారదర్శకంగా సాగాయని చూపడానికి కిమ్ వేసే ఎత్తుగడ అని మరికొందరు చెబుతున్నారు. కాగా కిమ్ మరోసారి సుప్రీంలీడర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.