News July 7, 2025

చిత్తూరు: అంటీముట్టనట్లుగానే వైసీపీ ఇన్‌ఛార్జ్‌లు?

image

ఎన్నికలు జరిగి ఏడాదవుతున్నా నియోజకవర్గాల్లో వైసీపీ బలోపేతానికి కృషి చేయాల్సిన మాజీలు ఎక్కడా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. YCP అధికారంలో ఉన్నన్ని రోజులు చుట్టపు MLAలుగా ఉన్న ఆ నేతలు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదేతరహాలో వ్యవహరిస్తున్నారట. పలమనేరు, పూతలపట్టు, మదనపల్లె, పీలేరు, కుప్పం ఇన్‌ఛార్జ్‌లు రాష్ట్రస్థాయిలో మినహా నియోజకవర్గ కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.

Similar News

News August 30, 2025

చిత్తూరు: లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు

image

జిల్లా కలెక్టరేట్‌లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో డీఆర్ఓ మోహన్ కుమార్, DC విజయ శేఖర్ బాబు ఆధ్వర్యంలో శనివారం లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు జరిగింది. 11 బార్లు, గీత కార్మికులను ఒక బారుకు గాను 4 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిని చిత్తూరు నగరపాలక పరిధిలో 3, పుంగనూరు మున్సిపాలిటీలో 1, కుప్పం మున్సిపాలిటీలో 1 ఎంపికైన వారికి కేటాయించినట్లు తెలిపారు.

News August 30, 2025

CTR: నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో శనివారం నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. లబ్ధిదారులు స్వస్థలాలకు వచ్చి డీలర్, వీఆర్వోల సమక్షంలో కార్డులు పొందాలని సూచించారు. బయోమెట్రిక్ వేసిన అనంతరం కార్డులు అందజేస్తామన్నారు. జిల్లాకు 5.26 లక్షల స్మార్ట్ కార్డులు వచ్చినట్టు వెల్లడించారు.

News August 30, 2025

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేనా?

image

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి తనకు అవకాశం కల్పించాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. అలాగే మద్యం కేసులో రెగ్యులర్ బెయిల్ కావాలని కోరారు. ఈ రెండు పిటిషన్లపై విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. మరి మిథున్ రెడ్డి బెయిల్ వస్తుందో? లేదో? చూడాలి మరి.