News July 7, 2025

ధర్మవరంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ

image

ధర్మవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణా తరగతులు ప్రారంభించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సురేష్ బాబు సోమవారం తెలిపారు. ఈనెల 16 నుంచి ఎంఐఎస్ డేటా అనలిస్ట్ – ఫైనాన్షియల్ సర్వీసెస్ కోర్స్ ప్రారంభిస్తామన్నారు. ఆసక్తి ఉన్న యువత వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.

Similar News

News July 8, 2025

NLG: రోడ్లు రక్తసిక్తం.. 17 రోజుల్లో 29 మంది మృతి

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. రోజూ జిల్లాలో ఎక్కడో ఓ చోట ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 రోజుల్లో 29 మంది దుర్మరణం చెందారు. అతివేగం, మద్యం మత్తు, రోడ్ల వెంట వాహనాలు నిలపడమే ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. రోడ్లపై వాహనాలు నిలపకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

News July 8, 2025

సాగరతీర విహారానికి డబుల్ డెక్కర్ బస్సులు

image

సాగరతీర విహారానికి డబుల్ డెక్కర్ బస్సులు సిద్ధంగా వున్నాయి. RK బీచ్ నుంచి భీమిలి వరకు సైట్ సీయింగ్ కోసం పర్యాటక శాఖ ఈ బస్సులను త్వరలోనే ప్రవేశ పెట్టనుంది. బీచ్ అందాలను డబుల్ డెక్కర్ నుంచి వీక్షించడానికి వైజాగ్ వాసులు ఎదురు చూస్తున్నారు. పర్యాటకంగా విశాఖకు ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అధికారులు భావిస్తున్నారు.

News July 8, 2025

ఇల్లందు నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి RTC బస్సులు

image

ఇల్లందు నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఆలయాల దైవ దర్శనాల కోసం ప్రత్యేకంగా RTC డీలక్స్ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఖమ్మం RTC RM సరిరామ్ తెలిపారు. జులై 13న ఉదయం 5 గంటలకు ఇల్లందు బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.840, పిల్లలకు రూ.440 నిర్ణయించామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 91364 46666, 98661 59829 నంబర్లను సంప్రదించాలన్నారు.