News July 7, 2025
ఉమ్మడి KNR జిల్లా కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా అద్దంకి దయాకర్

ఉమ్మడి జిల్లాలకు కాంగ్రెస్ ఇంఛార్జ్‌లను TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి KNR జిల్లాకు ఇంఛార్జిగా అద్దంకి దయాకర్‌ను నియమించారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, స్థానిక రాజకీయాల్లో చైతన్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అద్దంకి దయాకర్ ప్రస్తుతం MLCగా కొనసాగుతున్నారు. ప్రజల్లో ఆయనకున్న ఆదరణను చూసి ఈ బాధ్యతను అప్పగించారు.
Similar News
News July 8, 2025
గిరి ప్రదక్షిణ భక్తులకు హెల్ప్ లైన్ నంబర్లు

జూలై 9న జరగబోయే గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం జీవీఎంసీ హెల్ప్ లైన్, టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం తెలిపారు. 32 కి.మీలు ప్రదక్షిణలో జీవీఎంసీ తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు దీపాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిందని, భక్తులకు సమస్యలు ఎదురైతే జీవీఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 0891-2507225, టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009లకు కాల్ చేయాలన్నారు.
News July 8, 2025
అమరచింత ఎస్సై, ఏఎస్ఐపై వేటు..?

ధర్మపురంలో క్రికెట్ గొడవల నేపథ్యంలో యువకుడి మృతి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అమరచింత ఎస్సై సురేశ్, ఏఎస్ఐ జమీరుద్దీన్‌లపై సస్పెన్షన్ వేటు పడినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసు శాఖ రహస్యంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజులుగా స్టేషన్‌కు దూరంగా ఉండటం, అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈరోజు కొత్త SI బాధ్యతలు తీసుకోనున్నారు.
News July 8, 2025
‘డిగ్రీ’ వద్దంటా..!

TG: డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించట్లేదు. గత ఐదేళ్లుగా అడ్మిషన్లు క్రమంగా తగ్గుతూ రావడమే ఇందుకు నిదర్శనం. దోస్త్ మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ముగియగా ఈ విద్యా సంవత్సరంలో 4.36 లక్షల సీట్లకు 1.41 లక్షల విద్యార్థులే కాలేజీల్లో చేరారు. రాష్ట్రంలోని 957 డిగ్రీ కాలేజీల్లో 64 చోట్ల జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. అదే సమయంలో ఇంజినీరింగ్‌లో చేరే వారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.