News July 7, 2025

అరకు: ఈ నెల 10 సమావేశానికి తల్లిదండ్రులు తప్పనిసరి

image

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 10వతేదీన పేరెంట్-టీచర్ సమావేశం నిర్వహిస్తున్నట్లు యండపల్లివలస APTWRJC(బాలికలు) ప్రిన్సిపాల్ అల్లు సత్యవతి తెలిపారు. కళాశాల ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం జరుతుందని నేడు ఆమె తెలిపారు. కాలేజీలో చదువుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని ప్రిన్సిపల్ కోరారు.

Similar News

News July 8, 2025

రేపు పార్వతీపురంలో జాబ్ మేళా

image

పార్వతీపురంలో రేపు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఊపాధి కల్పన అధికారి ఆర్.వహీదా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళా పార్వతీపురం జూనియర్ కళాశాలలో జరుగుతుందని, వివిధ ఫార్మా సంస్థలు 85 ఖాళీలను భర్తీ చేస్తాయని ఆమె చెప్పారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News July 8, 2025

శ్రీకాకుళం: 10న ఐటీఐ కాలేజీలో జాబ్ మేళా

image

శ్రీకాకుళంలోని బలగలో ఉన్న గవర్నమెంట్ ఐటిఐ కాలేజీలో జూలై 10న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మోహన్ రావు సోమవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇంటర్, ఐటిఐ ఫిట్టర్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా మెకానికల్ విద్యార్హత కలిగి 26 ఏళ్ల లోపు యువతీ యువకులు అర్హులని తెలిపారు.

News July 8, 2025

ఉంగుటూరు: వ్యక్తిపై తలపై కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు

image

ఓ వ్యక్తి మరోకరి తలపై కత్తితో దాడి చేసి గాయపరిచిన సంఘటన సోమవారం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా సింగరాజు పాలెం గ్రామానికి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తిని ఉంగుటూరు ఎర్ర చెరువు వద్ద దాడి చేశారు. సమాచారం అందుకున్న చేబ్రోలు పోలీసులు ఘటనా ప్రదేశానికి వచ్చి పరిశీలించారు. గాయపడిన వ్యక్తిని కారులో తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు.