News July 7, 2025
అభివృద్ధి పథకాలపై ప్రణాళికను ఏర్పాటు చేయాలి- కలెక్టర్

కేంద్ర అభివృద్ధి పథకాలపై ఈనెల 9న జరగనున్న దిశ సమావేశానికి సంబంధించి అధికారులు పూర్తి నివేదికలతో, లక్ష్యాల సాధనకు తగిన ప్రణాళికతో హాజరవ్వాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ముందస్తు ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి శాఖ ప్రగతిపై సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.
Similar News
News July 8, 2025
పరిగి తహశీల్దార్ ఆనందరావుపై వేటు?

ప్రభుత్వ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిగి తహశీల్దార్ ఆనందరావుపై శాఖపరమైన చర్యలు తీసుకొని కలెక్టరేట్‌కు అటాచ్ చేసినట్లు సమాచారం. గత 12 రోజులగా ప్రజాసంఘాలు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, కలెక్టర్‌కు ఫిర్యాదు ఫలితంగా వేటు పడిందని, దీంతో కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరి నూతన తహశీల్దార్‌గా పరిగి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆనందరావు సెలవులో ఉన్నారు.
News July 8, 2025
గిరి ప్రదక్షిణ భక్తులకు హెల్ప్ లైన్ నంబర్లు

జూలై 9న జరగబోయే గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం జీవీఎంసీ హెల్ప్ లైన్, టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం తెలిపారు. 32 కి.మీలు ప్రదక్షిణలో జీవీఎంసీ తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు దీపాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిందని, భక్తులకు సమస్యలు ఎదురైతే జీవీఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 0891-2507225, టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009లకు కాల్ చేయాలన్నారు.
News July 8, 2025
అమరచింత ఎస్సై, ఏఎస్ఐపై వేటు..?

ధర్మపురంలో క్రికెట్ గొడవల నేపథ్యంలో యువకుడి మృతి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అమరచింత ఎస్సై సురేశ్, ఏఎస్ఐ జమీరుద్దీన్‌లపై సస్పెన్షన్ వేటు పడినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసు శాఖ రహస్యంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజులుగా స్టేషన్‌కు దూరంగా ఉండటం, అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈరోజు కొత్త SI బాధ్యతలు తీసుకోనున్నారు.