News July 7, 2025
ఖాజాగూడ భూకబ్జా కేసులో హైకోర్టు నోటీసులు

ఖాజాగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా భారీ టవర్లు నిర్మిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మురళీనాయక్, కూచుకుల్ల రాజేశ్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. షోహిని బిల్డర్స్, బెవర్లీ హిల్స్‌తో సహా ఐదుగురు ప్రైవేట్ ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. రెండువారాల్లో నివేదిక సమర్పించాలని తెలిపింది.
Similar News
News July 8, 2025
‘డిగ్రీ’ వద్దంటా..!

TG: డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించట్లేదు. గత ఐదేళ్లుగా అడ్మిషన్లు క్రమంగా తగ్గుతూ రావడమే ఇందుకు నిదర్శనం. దోస్త్ మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ముగియగా ఈ విద్యా సంవత్సరంలో 4.36 లక్షల సీట్లకు 1.41 లక్షల విద్యార్థులే కాలేజీల్లో చేరారు. రాష్ట్రంలోని 957 డిగ్రీ కాలేజీల్లో 64 చోట్ల జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. అదే సమయంలో ఇంజినీరింగ్‌లో చేరే వారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.
News July 8, 2025
NLG: రోడ్లు రక్తసిక్తం.. 17 రోజుల్లో 29 మంది మృతి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. రోజూ జిల్లాలో ఎక్కడో ఓ చోట ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 రోజుల్లో 29 మంది దుర్మరణం చెందారు. అతివేగం, మద్యం మత్తు, రోడ్ల వెంట వాహనాలు నిలపడమే ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. రోడ్లపై వాహనాలు నిలపకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
News July 8, 2025
సాగరతీర విహారానికి డబుల్ డెక్కర్ బస్సులు

సాగరతీర విహారానికి డబుల్ డెక్కర్ బస్సులు సిద్ధంగా వున్నాయి. RK బీచ్ నుంచి భీమిలి వరకు సైట్ సీయింగ్ కోసం పర్యాటక శాఖ ఈ బస్సులను త్వరలోనే ప్రవేశ పెట్టనుంది. బీచ్ అందాలను డబుల్ డెక్కర్ నుంచి వీక్షించడానికి వైజాగ్ వాసులు ఎదురు చూస్తున్నారు. పర్యాటకంగా విశాఖకు ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అధికారులు భావిస్తున్నారు.