News July 7, 2025

ప్రభుత్వాన్ని నిలదీయాలి: గుడివాడ అమర్నాథ్

image

వైసీపీ శ్రేణులు సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డులో సోమవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. కూటమి నాయకులు లేనిపోని హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా హామీలను అమలు చేయలేదని విమర్శించారు. హామీలు అమలుకు కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.

Similar News

News July 8, 2025

UAE గోల్డెన్ వీసా.. వలసలు పెరుగుతాయా?

image

UAE <<16970784>>గోల్డెన్ వీసాతో<<>> భారతీయులు ఆ దేశంలో స్థిరపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రూ.4.66 కోట్ల పెట్టుబడి పెడితేనే ఈ వీసా వచ్చేది. ఇప్పుడు రూ.23 లక్షలు చెల్లిస్తే చాలు జీవితకాలం చెల్లుబాటయ్యే వీసా వస్తుంది. గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు తమ కుటుంబసభ్యులను అక్కడికి తీసుకెళ్లొచ్చు. వ్యాపారం, ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ దేశంలో తక్కువ పన్నులు, మెరుగైన మౌలిక వసతులు భారతీయులను ఆకర్షించొచ్చు.

News July 8, 2025

వేధింపులకు గురిచేయడం వలనే ఆత్మహత్య చేసుకుంది: ఎస్సై

image

కొయ్యూరు మండలం రావణాపల్లిలో మౌనిక అనే వివాహిత తన కుమార్తె లాస్యశ్రీ(5)తో కలిసి ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కిషోర్ వర్మ సోమవారం తెలిపారు. సతీశ్ కుమార్‌ను మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకుందన్నారు. సతీశ్ మద్యం తాగి ఇంటికి రావడం, అనుమానించడం, వేధింపులకు గురి చేయడం వలనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.

News July 8, 2025

రేపు పార్వతీపురంలో జాబ్ మేళా

image

పార్వతీపురంలో రేపు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఊపాధి కల్పన అధికారి ఆర్.వహీదా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళా పార్వతీపురం జూనియర్ కళాశాలలో జరుగుతుందని, వివిధ ఫార్మా సంస్థలు 85 ఖాళీలను భర్తీ చేస్తాయని ఆమె చెప్పారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.