News July 7, 2025

MBNR: HCA 2డే లీగ్.. మొదటి రోజు మనదే

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి B- డివిజన్ 2డే లీగ్ టోర్నీలో ఉమ్మడి పాలమూరు జిల్లా జట్టు మొదటి రోజు సత్తాచాటింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 68.1 ఓవర్లలో 243/10 పరుగులు చేసింది. అనంతరం రాకేష్-XI జట్టు 19.1 ఓవర్లలో 55/6 పరుగులు చేసింది. మహబూబ్ నగర్ జట్టులో శ్రీకాంత్-71, సంజయ్-69 పరుగులు చేయగా.. గగన్ 4 వికెట్లు తీశారు. మహబూబ్ నగర్ 188 పరుగుల లీడ్‌లో ఉంది.

Similar News

News August 31, 2025

విద్యార్థులను ఉన్నత స్థానాలకు ఎదగాలి: GN శ్రీనివాస్

image

విద్యార్థులు కొత్త టెక్నాలజీను నేర్చుకునే ఉన్నత స్థాయికి ఎదగాలని పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ (VC) జిఎన్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం MBNRలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ త్రిబుల్ ఐటీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో బాసర త్రిబుల్ ఐటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

News August 31, 2025

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు- SP

image

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామని మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 వరకు గణపతి విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారని, ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని పోలీసు అధికారి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్ఓలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

News August 31, 2025

పాలమూరు: మొత్తం విగ్రహాలు..@2,447

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,447 గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లాలోని అత్యధికంగా మహబూబ్‌నగర్ రూరల్ PS పరిధిలో 300, అత్యల్పంగా మిడ్జిల్ PS పరిధిలో 88 రిజిస్ట్రేషన్లు అయ్యాయని, అన్ని వినాయక మండపాల జియో-ట్యాగింగ్ పూర్తి నిమజ్జన రూట్‌మ్యాప్‌‌తో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయన్నారు. అన్ని విధాలుగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.