News July 7, 2025
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: సిద్దిపేట కలెక్టర్

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఐడీఓసీలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగర్‌వాల్, అబ్దుల్ హమీద్‌తో కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి 152 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు.
Similar News
News July 8, 2025
వికారాబాద్: ప్రాణాలు పోతున్నాయి సార్.. హైవే ఇంకెప్పుడు?

బీజాపూర్ జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల రోడ్డు పనులు కొన్నేళ్లుగా ముందుకు సాగడం లేదు. దీంతో రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. 2021 నుంచి 2025 మే నాటికి రోడ్డుపై మొత్తం 715 ప్రమాదాలు జరిగాయి. 181 మంది మృతి చెందగా, మరో 707 మంది క్షతగాత్రులయ్యారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి రోడ్డు పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు.
News July 8, 2025
సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన షెడ్యూల్

★ ఉ.10.50 గంటలకు హెలికాప్టర్‌లో సున్నిపెంటకు రాక
★ రోడ్డు మార్గంలో 11.15 గంటలకు శ్రీశైలం ఆలయానికి చేరిక
★ ఉ.11.15 నుంచి 11.35 గంటల వరకు శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామి దర్శనం
★ దర్శనం అనంతరం ఉ.11.50 గంటలకు నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టుకు రాక
★ కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు, <<16985915>>శ్రీశైలం<<>> డ్యాం గేట్లు ఎత్తే కార్యక్రమంలో పాల్గొంటారు
★ మ.12.25 నుంచి 1.10 గంట వరకు సాగునీటి సంఘాల నాయకులతో ముఖాముఖి
News July 8, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: అదే హాట్ టాపిక్!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో TDP మద్దతు కోసం కేటీఆర్ ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. అక్కడ BRS గెలిచేందుకు టీడీపీ మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరినట్లు పలువురు హస్తం నేతలు చెబుతున్నారు. ఈ ఆరోపణలను BRS వర్గాలు ఖండిస్తున్నాయి. 2023లో TDP మద్దతు లేకుండానే HYDలో దాదాపు అన్ని సీట్లను గెలిచామని, తమకు ఆ అవసరం లేదని పేర్కొంటున్నాయి.