News July 7, 2025

నేటి ప్రజావాణికి 95దరఖాస్తులు: కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ప్రజావాణికి వచ్చినా దరఖాస్తుల వివరాలు వెల్లడించారు. భూ సమస్యలు 47, ఎంపీడీఓకి 13, డీపీఓ 10, శాఖలకు సంబంధించి 25 మొత్తం 95 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకి పంపుతామన్నారు.

Similar News

News July 8, 2025

పాశమైలారంలో వారం రోజులుగా పడిగాపులు

image

సిగాచీలో పేలుడు ఘటన ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. పరిశ్రమంలో పనిచేసేందుకు వచ్చిన వారు ఇలా అకస్మికంగా దూరం కావడంతో ఆ కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు. వారం రోజులుగా గల్లంతైన కార్మికుల కోసం వారి కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. చివరి చూపు కూడా నోచుకోకుండా పోతున్నామని మనోవేదనకు లోనవుతున్నారు. ఘటన సమయంలో వెలువడిన భారీ వేడికి బాడీలు పూర్తిగా కాలిపోయి బూడిదగా కలిసిపోయి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.

News July 8, 2025

పరిగి తహశీల్దార్ ఆనందరావుపై వేటు?

image

ప్రభుత్వ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిగి తహశీల్దార్ ఆనందరావుపై శాఖపరమైన చర్యలు తీసుకొని కలెక్టరేట్‌కు అటాచ్ చేసినట్లు సమాచారం. గత 12 రోజులగా ప్రజాసంఘాలు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, కలెక్టర్‌కు ఫిర్యాదు ఫలితంగా వేటు పడిందని, దీంతో కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరి నూతన తహశీల్దార్‌గా పరిగి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆనందరావు సెలవులో ఉన్నారు.

News July 8, 2025

గిరి ప్రదక్షిణ భక్తులకు హెల్ప్ లైన్ నంబర్లు

image

జూలై 9న జరగబోయే గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం జీవీఎంసీ హెల్ప్ లైన్, టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం తెలిపారు. 32 కి.మీలు ప్రదక్షిణలో జీవీఎంసీ తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు దీపాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిందని, భక్తులకు సమస్యలు ఎదురైతే జీవీఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 0891-2507225, టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009లకు కాల్ చేయాలన్నారు.