News March 30, 2024
HYD: సీఎంని కలిసిన నందమూరి సుహాసిని
HYD నగరంలో తెలంగాణ టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిశారు. సుహాసినిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా సమాచారం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి సురేఖ, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 12, 2025
HYD: భువనగిరి టోల్ గేట్ వద్ద ఇదీ పరిస్థితి..!
HYD నగరం ఉప్పల్ నుంచి బోడుప్పల్, ఘట్కేసర్ మీదుగా వరంగల్ వైపు వెళ్తున్న మార్గ మధ్యమంలో ఉన్న భువనగిరి టోల్ గేట్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచాయి. టోల్ గేట్ నుంచి దాదాపు అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పలువురు వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్ చేయించుకోకపోవడంతో కాస్త ఆలస్యం అవుతోంది. ఏదేమైనప్పటికీ ఇదే మార్గంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
News January 12, 2025
HYD: సంక్రాంతి స్పెషల్ బోర్డులు.!
బోడుప్పల్, KPHB, MGBS, JBS, కూకట్పల్లి కుషాయిగూడ ప్రాంతాల్లో సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులకు సైతం ముందస్తుగానే సంక్రాంతి స్పెషల్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో రద్దీ పెరిగితే వెంటనే సిటీ బస్సులను జిల్లా బస్సులుగా మార్చి, ప్రయాణికులను తరలిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. సిటీలో తిరిగే సర్వీసులకు అదనపు ఛార్జీలు లేవని, కేవలం జిల్లా స్పెషల్ సర్వీసులకే ఉన్నట్లు పేర్కొన్నారు.
News January 12, 2025
HYD: హైడ్రాకు ప్రజావాణిలో 83 ఫిర్యాదులు
చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లు, పుట్పాత్లను పరిరక్షణ ధ్యేయంగా ఏర్పాటు హైడ్రా దూకుడు పెంచింది. ఈ సంస్థ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ భూముల కబ్జా, లేఅవుట్లు, ప్లాట్ల తగాదాలు, రోడ్డు ఆక్రమణల వంటి 10వేల ఫిర్యాదులు వచ్చాయి. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 83ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.