News July 7, 2025
BREAKING: సిద్దిపేట: చేర్యాలలో చైన్ స్నాచింగ్

బైక్ ఎక్కించుకుంటానని వృద్ధురాలిని నమ్మించిన ఇద్దరు యువకులు ఆమె మెడలో నుంచి సుమారు నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును అపహరించారు. ఈ ఘటన చేర్యాల మండలం తాడూరు క్రాసింగ్ వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. తాడూరు గ్రామానికి చెందిన ఈరు సత్తవ్వ(65) స్వగ్రామానికి వెళ్లడానికి రోడ్డుపై ఉండగా యువకులు లిఫ్ట్ ఇస్తామని చెప్పి బైక్‌పై ఎక్కించుకుని చైన్ స్నాచింగ్ చేసి, మార్గం మధ్యలో ఆమెను వదిలేసి వెళ్లారు.
Similar News
News July 8, 2025
హైదరాబాద్: వైద్యశాఖలో ఉద్యోగాలు

హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (UPHCs) కాంట్రాక్ట్ పద్ధతిన 45 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హతగా MBBS డిగ్రీతో పాటు తెలంగాణ వైద్య మండలిలో నమోదు తప్పనిసరి. నెలవారీ వేతనం రూ.52,000 ఉంటుంది. దరఖాస్తులు 09-07-2025 నుంచి 11-07-2025 మధ్య సికింద్రాబాద్ ప్యాట్నీలోని జిల్లా ఆరోగ్యాధికారికి సమర్పించవచ్చు.
SHARE IT
News July 8, 2025
నన్ను కూడా చంపేవారు: నల్లపురెడ్డి

AP: నెల్లూరు సుజాతమ్మ కాలనీలోని తన ఇంటిపై జరిగిన దాడి <<16984961>>ఘటనపై <<>>వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. ‘నెల్లూరు జిల్లాలో దాడి సంస్కృతి ఎప్పుడూ లేదు. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయం చేస్తారని అనుకోలేదు. నేను, నా కొడుకు బయటకెళ్లాక దాడి చేశారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారు. దాడి సమయంలో ఇంట్లో ఉన్న మా అమ్మను బెదిరించారు. ఇంట్లో ఉంటే నన్ను కూడా చంపేవారు’ అని ఆరోపించారు.
News July 8, 2025
గుంటూరులో కూరగాయల ధరలు రెట్టింపు

గుంటూరు మార్కెట్లలో టమాటా, పచ్చిమిరప, వంకాయ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. పచ్చిమిరప కిలో రూ.80కి చేరగా, టమాటా రూ.40, వంకాయ రూ.60 పలుకుతోంది. ములక్కాయ ఒక్కటి రూ.15 నుంచి రూ.20కి పెరగడం వినియోగదారులను కుదిపేస్తోంది. డిమాండ్‌తో పోల్చితే సరఫరా తక్కువగా ఉండటం వల్లే ఈ ధరల పెరుగుదల అని వ్యాపారులు తెలిపారు. రైతుబజార్లలో కూడా ఇదే స్థితి కొనసాగుతోంది.