News July 7, 2025
అనామకులతో అప్రమత్తంగా ఉండాలి: SP

మీ రక్షణే మా భద్రతగా నెల్లూరు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. నెల్లూరు బారాషహిద్ దర్గాలో రెండో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగలో పోలీసు బందోబస్తు, గంధ మహోత్సవానికి చేసిన ఏర్పాట్లను ఆయన పోలీసు అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. రాత్రికి జరగనున్న ప్రధాన ఘట్టం అయిన గంధ మహోత్సవానికి పగడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అనామకులతో అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News August 31, 2025
గణేశ్ నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నెల్లూరు ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు. ఆదివారం ఐదో రోజు సందర్భంగా ఎక్కువ మొత్తంలో వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం వద్ద తీసుకోవలసిన భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వినాయక విగ్రహాల ఊరేగింపు సమయంలో బాణసంచా కాల్చేటపుడు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
News August 31, 2025
నెల్లూరు జిల్లాలో ఆ బార్లు అన్నీ క్లోజ్..!

నూతన పాలసీ కింద నెల్లూరు జిల్లాలో 55 బార్లు ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చారు. 21షాపులకు మాత్రమే 94 అప్లికేషన్లు వచ్చాయి. నెల్లూరులో 15, కావలిలో 3, కందుకూరులో 3.. మొత్తం 21 బార్లను కొత్తవారికి లాటరీ ద్వారా కేటాయించారు. ఇవి కాకుండా జిల్లాలో ప్రస్తుతం 47 బార్లుకు లైసెన్స్ ముగిసింది. వీటిని నేటి రాత్రి నుంచి పూర్తిగా క్లోజ్ చేయనున్నారు. ఇకపై నెల్లూరు, కావలి, కందుకూరులోనే బార్లు అందుబాటులో ఉండనున్నాయి.
News August 31, 2025
ఏడాదిలోనే హామీలు అమలు: మంత్రి నారాయణ

అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని మంత్రి నారాయణ అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ నెల్లూరు నగరంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. అధికారంలోకి వచ్చీ రాగానే పెన్షన్ల పెంపు ద్వారా చిత్తశుద్ధి నిరూపించుకున్నామని, ప్రతి పిల్లవాడికి రూ.15 వేల చొప్పున తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు.