News March 30, 2024
గోపాలపురంలో గెలిచిన మహిళా అభ్యర్థులు వీరే

ప.గో జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు(1962-2019) 13సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 3సార్లు మహిళలు MLAలుగా గెలిచారు. 1978లో దాసరి సరోజినిదేవి(కాంగ్రెస్‘ఐ‘), 2004లో మద్దాల సునీత(కాంగ్రెస్‘ఐ’), 2009లో తానేటి వనిత(TDP) నుంచి గెలుపొందారు. ఇక్కడి నుంచి వనిత మరోసారి MLA అభ్యర్థిగా బరిలో ఉంటుండగా.. ఈసారి పార్టీ మాత్రం వేరు. ఆమె 2009లో TDP నుంచి పోటీ చేసి గెలవగా.. ఈసారి వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు.
Similar News
News September 9, 2025
ఆకివీడు: మహిళపై దాడికి దిగిన వ్యక్తిపై కేసు నమోదు

ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై దాడికి దిగి చంపేస్తానని బెదిరించిన వ్యక్తిపై ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని సిద్దాపురం గ్రామానికి చెందిన సువ్వారి రంగమ్మ మరో ముగ్గురితో కలిసి ఆటోలో వస్తుండగా అదే ఆటోలో ప్రయాణిస్తున్న సింగపర్తి కొండ దౌర్జన్యం చేసి చంపుతానని బెదిరించినట్లు ఆకివీడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెడ్ కానిస్టేబుల్ జే నాగేశ్వరరావు కేసు నమోదు చేసినట్లు వివరించారు.
News September 9, 2025
నరసాపురం వరకు వందేభారత్ రైలు పొడిగింపునకు లేఖ

వందే భరత్ రైలు సర్వీస్‌ను చెన్నై – విజయవాడ నుంచి భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ మేరకు రైల్వే కమిటీ ఛైర్మన్ అనకాపల్లి ఎంపీ CM రమేష్‌కు లేఖ రాసినట్లు ఆయన మంగళవారం తెలిపారు. ఈ సర్వీసు పొడిగింపు వల్ల రవాణ వేగం పెరుగుతుందని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఎంతో ఉపయోగ పడుతుందని లేఖలో రాసినట్లు తెలిపారు.
News September 9, 2025
ఆలయంలో అగ్నిప్రమాదంపై ఎస్పీ విచారణ

మొగల్తూరులోని శ్రీ నడివీధి ముత్యాలమ్మ ఆలయ దహనానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మంగళవారం తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా నేర పరిశోధనలో నిపుణులైన FSL బృందం, డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక భద్రతా బృందాలు సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నాయన్నారు. తనిఖీల అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.