News July 7, 2025

అందుకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశా: ముల్డర్

image

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో 400 కొట్టి లారా రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్నా SA కెప్టెన్ ముల్డర్(367*) ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దాని వెనుకున్న కారణాన్ని ఆయన బయటపెట్టారు. ‘గెలవడానికి సరిపడా స్కోర్ చేశామని భావించాం. లారా ఒక లెజెండ్. ఆ రికార్డు అలాగే ఉండేందుకు ఆయన అర్హులు. మళ్లీ ఛాన్స్ వచ్చినా ఇదే నిర్ణయం తీసుకుంటా. కోచ్ శుక్రీ కూడా ఇదే అన్నారు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News July 8, 2025

నన్ను కూడా చంపేవారు: నల్లపురెడ్డి

image

AP: నెల్లూరు సుజాతమ్మ కాలనీలోని తన ఇంటిపై జరిగిన దాడి <<16984961>>ఘటనపై <<>>వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. ‘నెల్లూరు జిల్లాలో దాడి సంస్కృతి ఎప్పుడూ లేదు. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయం చేస్తారని అనుకోలేదు. నేను, నా కొడుకు బయటకెళ్లాక దాడి చేశారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారు. దాడి సమయంలో ఇంట్లో ఉన్న మా అమ్మను బెదిరించారు. ఇంట్లో ఉంటే నన్ను కూడా చంపేవారు’ అని ఆరోపించారు.

News July 8, 2025

తోడు కోసం పెళ్లి చేసుకుంటే రూ.28 కోట్లతో జంప్!

image

AP: చిత్తూరు(D) రాజుపేటకు చెందిన నాగమణి (50) గతంలో భర్త, కుమారుడిని కోల్పోయారు. శేష జీవితంలో తోడు కోసం పెళ్లి బ్రోకర్ ద్వారా ప్రకటన ఇచ్చారు. శేషాపురానికి చెందిన శివప్రసాద్‌(40) కరోనాతో తన భార్య చనిపోయిందని నమ్మించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులో నాగమణికి చెందిన రూ.10 కోట్ల విలువైన భూమి, రూ.15 కోట్ల అపార్ట్‌మెంట్ విక్రయించడంతో పాటు రూ.3 కోట్లు తీసుకుని పారిపోయాడు. ఆమె పోలీసులను ఆశ్రయించారు.

News July 8, 2025

కొత్త పంచాయతీ భవన నిర్మాణాలకు ఆమోదం

image

AP: సొంత భవనాలు లేని 417 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో భవనాన్ని రూ.32 లక్షలతో నిర్మించేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఇందులో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ నుంచి రూ.25 లక్షలు, ఉపాధి హామీ పథకం కింద రూ.7లక్షల నిధులను ఉపయోగించుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.